ప్రకాశం : ఆ ఓటమి ఎరుగని ధీరులకు ప్రమోషన్ ఇచ్చిన టీడీపీ హైకమాండ్..!!
రెండు చోట్ల స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయింది..ఇంతటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇచ్చి అరుదైన అవకాశం కల్పిచారని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం తనదైన శైలిలో ఇద్దరిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు..గొట్టిపాటి రవికుమార్ వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి మార్టూరు నుంచి ఎన్నికైన ఆయన అద్దంకి నుంచి నాల్గోసారి గెలుపొందారు టీడీపీలో చేరిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అద్దంకిలో ఆయనే విజయం సాధించారు.. తద్వారా నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న బలమైన సంబంధాలు నిరూపితమయ్యాయి.
ఇక గత ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జగన్ ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరణం బలరాం, శిద్దా రాఘవరావులు పార్టీని వీడినా రవికుమార్ మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఎలాంటి వివాదాలకు పోకుండా జిల్లాలోని పార్టీ నాయకులందరితో కలిసి నడవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకొనే రవికుమార్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లుగా పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.అలాగే ప్రభుత్వ డాక్టర్ అయిన స్వామి దామచర్ల కుటుంబం సహకారంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తొలిసారి అటు ఎమ్మెల్యేగా ఇటు టీటీడీ సభ్యుడిగా అద్భుత పాలనా వ్యవహారాలను సాగించారు. గత వైసీపీ ప్రభుత్వ వేధింపులను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు వారిరువురికి ప్రమోషన్స్ ఇచ్చారు.