ఏపీలో కొత్త స్పీకర్‌ ఈయనే...తమ్మినేనిని మించిపోయేలా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే ఈ సందర్భంగా.. 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే దానిపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఒకరు... ఏపీ అసెంబ్లీ స్పీకర్ కాబోతున్నారు. అయితే ఇప్పటివరకు... టిడిపిలో ఉన్న యనమల రామకృష్ణుడు అలాగే కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే కోడెల శివప్రసాద్... స్పీకర్ అయ్యారు. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆయన ఓడిపోవడం జరిగింది. అంతే కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల కోడెల శివప్రసాద్... మృతి చెందారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమ్మినేని సీతారాం... ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు.

 
ఆయన ప్రతిపక్ష నేతలపై... నిత్యం ఎదురుదాడి చేసేవారు. వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా... తెలుగుదేశం సభ్యులపై విరుచుకుపడేవారు. అయితే మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో... తమ్మినేని సీతారాం  కూడా ఓటమి పాలయ్యారు. ఇలా ఏపీ స్పీకర్ గా పని చేసిన ఇద్దరు కూడా... ఓడిపోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో... ఏపీ స్పీకర్ పదవి తీసుకునేందుకు  తెలుగుదేశం పార్టీ నేతలు వణికి పోతున్నారట.



కానీ... అయ్యన్నపాత్రుడు మాత్రం... తాను స్పీకర్గా చేస్తానని... ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అనేక కష్టాలు అనుభవించారు అయ్యన్నపాత్రుడు. దానికి దీటుగానే వైసిపి నేతలపై నిత్యం.. ప్రెస్ మీట్ పెట్టి బండ బూతులు తిట్టేవారు.  అందుకే ఈసారి తనకు స్పీకర్ పదవి ఇవ్వాలని ఆయన అంటున్నారట. తమ్మినేని సీతారాం కు మించి పోయేలా అసెంబ్లీలో రెచ్చిపోతానని అంటున్నారట. స్పీకర్ గా చేస్తే ఓడిపోతారనే సెంటిమెంట్ తనకు అవసరం...లేదని...ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నారట అయ్యన్న పాత్రుడు. దీంతో అయ్యన్నేకు స్పీకర్‌ పదవి రానుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: