కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో టీడీపీ పార్టీ భారీ విక్టరీని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సారి ఎన్నికలలో టిడిపి సొంతగా కాకుండా జనసేన , బీజేపీ లతో పొత్తులో భాగంగా పోటీ చేసింది. ఈ కూటమికి భారీ మొత్తంలో సీట్లు వచ్చాయి. దానితో చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రమాణ స్వీకారం రోజే దాదాపు 5 ఫైళ్లపై సంతకాలు పెట్టబోతున్నారు అని , వాటితో ఆంధ్ర ప్రదేశ్ కి చాలా మంచి జరగబోతుంది అని చాలా రోజులుగా ఓ ప్రచారం జరిగింది.
కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు ఏ ఫైల్ పై సంతకం చేయలేదు. దానికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి ఆ వేడుకకు రావడం వల్ల ప్రోటో కాల్ ఉద్దేశంగా చంద్రబాబు నాయుడు ఏ ఫైల్ పై సంతకం చేయలేదు అని వార్తలు వచ్చాయి. ఇకపోతే టి డి పి ప్రభుత్వం కొన్ని విషయాలపై దూకుడు గా ప్రవర్తించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుండి కూడా వై సి పి ప్రభుత్వం లో మందు విషయంలో అనేక ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు మాత్రమే కాకుండా ఏవో పేరు తెలియని ఎన్నో కంపెనీలను తీసుకువచ్చి ఆ మందు బ్రాండ్ లను అమ్మారు.
వాటి ద్వారా ఆంధ్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక మొదటి నుండి కూడా మేము అధికారంలోకి వస్తే ఆ మందు బ్రాండ్ లను తీసేసి మంచి మందును తీసుకువస్తాం అని టి డి పి చెప్పుకుంటూ వస్తుంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే మంచి మందు బ్రాండ్ లను తీసుకురాబోతున్నట్లు వాటి విషయంలో చాలా దూకుడుగా ప్రభుత్వం వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలలో కూడా తెలుగు దేశం ప్రభుత్వం చాలా స్పీడ్ గా పనులన్నింటిని చక్క బెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.