ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో వైసిపి పార్టీ ఎన్నికలలోకి దిగింది. ఇక ఈ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ కి భారీ మొత్తంలో మెజారిటీ వచ్చింది. వైసీపీ పార్టీకి భారీ మొత్తంలో మెజారిటీ రాలేదు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడులా వై సి పి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లో ఉంటూ భారీ ఎత్తున పాదయాత్ర కూడా చేశాడు.
కొన్ని నెలల పాటు పాదయాత్రను సాగించిన జగన్ కి అద్భుతమైన క్రేజ్ ఆ సమయంలో వచ్చింది.
దానితో 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో వైసిపి పార్టీ ఒంటరి గానే పోటీలోకి దిగగా ఈ పార్టీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. భారీ మొత్తంలో పార్లమెంటు స్థానాలు కూడా వచ్చాయి. దానితో 2019 వ సంవత్సరం వై సీ పీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు విరు పరిపాలన బాగానే చేశారు. దానితో 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో కూడా వారి పార్టీకి భారీ మొత్తంలో సీట్లు వస్తాయి అని విరు ఆకాంక్షించారు. కానీ రిజల్ట్ మీరు ఊహకి అందలేదు.
కూటమికి భారీ మొత్తంలో సీట్లు రాగా వైసీపీ కి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. దానితో పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా డీలా పడిపోయారు. ఇకపోతే వారందరికీ తాజాగా వైసిపి పార్టీ అధినేత అయినటువంటి జగన్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు నేనున్నాను. 2014 లో భారీ ఓటమి వచ్చింది. అయినా తట్టుకొని నిలబడ్డాం. మళ్లీ అలానే ఉండాలి. ఆ సమయంలో ఎన్నో నెలలు పాదయాత్ర చేశాను. ఇప్పుడు కూడా నాలో సత్తువ ఉంది, ధైర్యం ఉంది, ఓపిక ఉంది. నిలబడే తత్వం ఉంది మీరు ఎవరు అధైర్య పడకండి అని వారందరికీ జగన్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.