ఏపీ: ఇక ఆ వాలంటీర్లకి కష్టమే.. వారికి చరమగీతం పాడతారా.?

Pandrala Sravanthi
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది. దీన్ని తీసుకొచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. అలాంటి వాలంటీర్లలో కొంతమంది 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం కీలకమైన పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఈ వాలంటీర్లు ఎంత కష్టపడ్డా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం గెలవలేక పోయింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో జగన్ తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థను  చంద్రబాబు ఉంచుతారా తీసేస్తారా అనే సస్పెన్స్ నెలకొని ఉంది. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం  వాలంటరీ వ్యవస్థను అలాగే కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది.

కానీ ఇందులో  కొంతమంది వాలంటీర్లకు మాత్రం చరమగీతం పాడుతారట. వారెవరు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏపీలో 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. దీంట్లో ఎన్నికలకు ముందు దాదాపు లక్ష మంది వరకు రిజైన్ చేశారు. దీనికి ప్రధాన కారణం వైయస్సార్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి, వారి మాటలను నమ్మి రిజైన్ చేశారు. మిగతా వాలంటీర్లంతా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో  చంద్రబాబు ప్రభుత్వం  రాజీనామా చేసిన వాలంటీర్లను మళ్లీ తీసుకునే అవకాశం అయితే కనిపించడం లేదు.  ప్రస్తుతం ఉన్న వారిని జీతాలు పెంచి కొనసాగిస్తారని తెలుస్తోంది.

ఇప్పుడున్న వారంతా  ఏ పార్టీకి పనిచేయకుండా ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం పనిచేసిన వారే అనుకోవచ్చు. అలాగే రాజీనామా చేసిన వారంతా వైసీపీ జెండా మోసిన వారని చెప్పుకోవచ్చు. ఉన్నవారిలో కూడా కొంతమందిని తీసేసే అవకాశం కనిపిస్తోంది. వారేవరంటే టిడిపి నాయకులకు ఎక్కడ అయితే సపోర్టు చేయలేదో అలాంటి వాలంటీర్లను తీసేసి, వారి ప్లేస్ లో టిడిపికి సంబంధించిన వారిని వాలంటీర్లుగా నియమించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రిజైన్ చేసిన ప్లేస్ లలో కొత్తవారిని నియమించి వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ నడిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి  వాలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: