ఏపీ: రుషికొండ భవనాల విమర్శలపై.. వైసిపి సంచలన పోస్ట్..!

Divya
గడిచిన రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త రుషికొండ భవనాలు.. ఈ వివాదం ఇప్పుడు మరింత వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా ఈ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించగా అనంతరం ఆ భవనాలకు సంబంధించి కొన్ని వీడియోలు ఫోటోలను సైతం సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు. వీటి పైన చాలా అనేక విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. తాజాగా రుషికొండ భవనాల పైన వస్తున్న విమర్శల పైన వైసీపీ పార్టీ అధికారికంగా తమ ట్విట్టర్ నుంచి స్పందించింది.

ట్విట్టర్లో వైసీపీ పార్టీ ఇలా పోస్ట్ చేస్తూ.. అవి ప్రభుత్వ భవనాలే ప్రైవేటు ఆస్తులు కావు విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని నిర్మించారు.. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారు.. అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి విశాఖకు వస్తే ఆదిత్యం ఇవ్వడానికి సరైన భవనం లేకపోవడం వల్లే వీటిని నిర్మించారని కానీ ఇప్పుడు టిడిపి పార్టీ ఈ ఫోటోలను విమర్శిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది అంటూ తెలిపారు.. టిడిపి వక్ర బుద్ధి అంటే ప్రజలకు తెలుసు అంటూ తెలియజేశారు.

రుషి కొండ పై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ నిన్నటి రోజున పరిశీలించి ఆయన మాట్లాడుతూ.. రుషికొండపై కట్టిన ఈ ప్యాలెస్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలను సైతం కట్టి నిర్మించారు అంటూ తెలిపారు. కూటమి శ్రేణులతో కలిసి నిర్మాణాలను పరిశీలించి ఆ తర్వాత ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారంటూ తెలిపారు. ప్రజల ధనంతో జగన్ కట్టిన ఈ భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో అసలు అర్థం కావడం లేదంటూ ఆయన విమర్శించారు.. వైసీపీ నేతలు భూదందా కూడా చేశారంటూ తెలిపారు గంట శ్రీనివాస్.. త్వరలోనే కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది అంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: