రాయలసీమ: తాడిపత్రిలో మళ్ళీ రాజుకున్న హత్య రాజకీయాలు..!

Divya
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా వైసీపీ,టిడిపి నేతల మధ్య పలు రకాల విభేదాలు కొట్లాటలు వంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం కాస్త సర్దు మునీగినట్టు అనిపించిన ఇప్పుడు తాజాగా తాడిపత్రి నందలపాడులో ఒక దారుణం చోటుచేసుకుంది. మెకానిక్ షాప్ లో పనిచేస్తున్న లాలు భాష అనే ఒక యువకుడు తన ఇంటి పైన నిద్రిస్తూ ఉండగా తనను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఈ సంఘటన స్థలానికి పోలీసులు సైతం చేరుకొని మరి విచారిస్తూ ఉన్నారు.

అయితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పాత కక్షలు కారణంగానే ఈ 23 ఏళ్ల యువకుడు అయిన లాలు ను హత్య చేసి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు తాడిపత్రి డిఎస్పి జనార్దన్ నాయుడు ,పట్టణ సిఐ నాగేంద్రప్రసాద్ ఈ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ కొన్ని వివరాలను సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మృతుని తండ్రి మహబూబ్ బాషా కూడా ఈ విషయం పైన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక  ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఇలాంటి హింసాత్మకమైన ఘటనలు కూడా కనిపిస్తున్నాయి.

ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా వైసిపి టిడిపి కార్యకర్తలు కొంత మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ఇరువురి నేతలు కూడా తెలియజేస్తున్నారు. అయితే లాలు భాష హత్యకు కారణం ఏంటి రాజకీయ వైర్యమా లేకపోతే వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉన్నాయా అనే విషయం కూడా తెలియడం లేదట..కానీ ఇప్పుడు తాడిపత్రి లోని ఈ హత్య రాజకీయాలు సైతం ఒక్కసారిగా అక్కడి ప్రజలను ఉలిక్కిపాటుకు గురి చేస్తున్నాయి. మరి అందుకు  సంబంధించి పూర్తి సమాచారం తెలియాలి అంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: