చంద్రబాబు: వారి అంతు చూసేందుకు రఘురామకు కీలక పదవి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా... మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు శాఖలు కూడా డివైడ్ చేసిన చంద్రబాబు... పాలనపై దృష్టి పెట్టారు. అయితే తెలుగుదేశం కూటమి మంత్రివర్గంలో కేవలం యంగ్ స్టార్లకు మాత్రమే ఛాన్స్ వచ్చింది.

తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డ సీనియర్లకు మాత్రం చంద్రబాబు నాయుడు పదవులు ఇవ్వలేదు. పదవులు రాని వారికి... కార్పొరేషన్ పదవులు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పారట. దీంతో... ఎన్నికల కంటే ముందు...  తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామకృష్ణం రాజుకు  ఇలాంటి పదవి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆయనకు స్పీకర్ పదవి వస్తుందని...అందరూ అంచనా వేశారు.

మరి కొంతమంది ఏపీ హోం మంత్రి అవుతారని... లెక్కలు వేశారు. హోం మంత్రి పదవి ఇస్తే... జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని... అందరూ అనుకున్నారు. కానీ అసలు ఆయనకు కేబినెట్లో స్థానమే లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో... రఘురామకృష్ణ రాజుకు టిటిడి పాలక మండలి చైర్మన్ పదవి అప్పగిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి పదవులు లేవు.  అందుకే ఆ కోటాలో... రఘురామకృష్ణ రాజు లేదా అశోక్ గజపతిరాజు లలో ఒకరికి టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని అందరూ అంటున్నారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పడు.. అశోక్ గజపతిరాజుకు కేంద్ర మంత్రి పదవి వచ్చింది. అందుకే ఇప్పుడు అశోక్ గజపతిరాజుకు పదవి ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఈ తరునంలోనే టీటీడీ చైర్మన్ పదవి రఘురామకృష్ణరాజుకు  ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు  డిసైడ్ అయ్యారని... ఆయనకు ఆ పదవి వస్తుందని అంటున్నారు. అయితే దీనిపై రెండు రోజుల్లో ఫైనల్ చేయనున్నారట చంద్రబాబు. ఒకవేళ టీటీడీ చైర్మన్గా రఘురామకృష్ణరాజు అయితే... గతంలో వైసిపి అక్కడ చేసిన అక్రమాలను వెలికి తీసే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: