కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో ఇద్దరు ఎమ్యెల్యేలు జంప్ ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. గులాబీ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ... జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత..కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. పది సంవత్సరాలపాటు పదవులు అనుభవించిన నేతలందరూ...కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.


ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళగా... తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చేవెళ్ల గులాబీ పార్టీ ఎమ్మెల్యే కాలే యాదయ్య... తన సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు... రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇందులో భాగంగానే.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో... రహస్య మంథనాలు చేశారట గులాబీ పార్టీ ఎమ్మెల్యే కాలే యాదయ్య.
 

గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే సరైన సముచిత స్థానం కల్పిస్తామని.... యాదయ్యకు కాంగ్రెస్ నేతలు కూడా హామీ ఇచ్చారట. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో కాంగ్రెస్ కండువా  కప్పుకునేందుకు ఎమ్మెల్యే యాదయ్య సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు కాలే యాదయ్య... ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.


ఆయన వర్గీయులు మాత్రం... అభివృద్ధి పనుల గురించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసినట్లు చెబుతున్నారు. గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాదయ్య  కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా యాదయ్య పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. కానీ కెసిఆర్ తోనే తన ప్రయాణం సాగుతుందని ఆ సందర్భంగా ప్రకటించారు ఎమ్మెల్యే యాదయ్య. మరి ఈసారి ఆయన స్పందిస్తారా లేదా చూడాలి. అటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నారట. ఏ క్షణమైన ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: