జగన్‌కు నేర్చుకోవాల్సిన చంద్రబాబు సక్సెస్ సీక్రెట్లు ఇవే..!
ఇది.. జాతీయస్థాయిలో చంద్రబాబుకు ఉన్న ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. ఇక, పార్టీలో నేతలకు కలివిడిగా ఉండడం అనేది చంద్రబాబు అనుసరించిన మరో కీలక విధానం. ఫలితంగా.. కూటమి మనగ లుగుతుందా? అని పెదవి విరిచిన విశ్లేషకులు కూడా..చంద్రబాబు తీరును చూసిన తర్వాత.. తమ అభి ప్రాయాలను మార్చుకునే పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా విదేశాలకు చెందిన దౌత్యాధికా రులు, ప్రతినిధులు కూడా.. ఏపీకి సహకరిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చంద్రబాబు సాధించిన ఘన విజయమనే చెప్పాలి. ఇది సాధారణంగా ఏ రాష్ట్రానికీ రాదు. కానీ .. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే దౌత్యవేత్తలు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. ఇక, ప్రజల విషయానికి వస్తే.. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో తమకు పనులు దొరుకుతాయని, వచ్చే ఐదేళ్లు తమ చేతికి పని ఉంటుందని మెజారిటీ కూలినాలి చేసుకునే వర్గాలు సంబరపడ్డాయి. వేతనంతో పనిలేదు.. వారికి పని దొరికితే చాలు అని ఫీలయ్యారు. దీనికి కారణం చంద్రబాబు వచ్చారు.. పెట్టుబడులు వస్తాయి.. అని భావించడంతోనే.
మరో కీలక విషయం.. ప్రజల్లోనూ భయం పోయింది. రాజకీయంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం వచ్చిందని వారు మురిసిపోతున్నారు. దీనికి కారణం.. కక్షలు కార్పణ్యాలు లేని విధంగా తమ పాలన ఉంటుందని తొలి రోజే చంద్రబాబు తేల్చి చెప్పడం. సో.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా.. ఎవరిని పలకరించినా.. సానుకూల దృక్ఫథమే కనిపిస్తోంది. దీనిని జగన్ సానుకూల ధోరణితో ఆలోచిస్తే.. ఇప్పటికి కాకపోయినా.. మరో ఐదేళ్ల కైనా ఆయన మారే పరిస్థితి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.