టిడిపి:ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యకు.. మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు కూటమికి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు మూకుమ్మడిగా వైసిపి పార్టీ మీద పోటీకి దిగడం జరిగింది. దీంతో కూటమి భారీ విజయాన్ని అందుకుంది. టీడీపీ నేతలు ఒక్కసారిగా నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇప్పటికే టిడిపి, జనసేన, బిజెపి నేతలకు సైతం కీలకమైన పదవులు కూడా ఇచ్చారు సీఎం  చంద్రబాబు నాయుడు. తాజాగా టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రోటెం స్పీకర్గా కేటాయించడం జరిగింది. అందుకు సంబంధించి రేపటి రోజున ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు. ఇటువంటి తరుణంలో బుచ్చయ్య చౌదరికి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు చౌదరికి ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్గా మీరే ఉండాలి అంటూ చెప్పడంతో ఆయన కూడా ఈ విషయాన్ని స్వీకరించారు. ఈనెల 21 లేదా 22వ తేదీల్లో జరిగే సమావేశాలలో చంద్రబాబు, పవన్, జగన్ తో సహా సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ముఖ్యంగా బుచ్చయ్య చౌదరి టిడిపికి సీనియర్ నేత కావడమే కాకుండా ఏడుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు సీఎం చంద్రబాబు. అత్యంత సీనియర్ శాసన సభ్యుడిగా కూడా సభలో ఉన్నటువంటి నేత బుచ్చయ్య చౌదరి.

9 సార్లు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సీనియర్ ఎమ్మెల్యేలుగా బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, పెద్దిరెడ్డి వంటి వారు ఉన్నారు అయ్యన్న పాత్రుడు కూడా ఎమ్మెల్యేగా ఏడుసార్లు గెలవడం జరిగింది.అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోనే బుచ్చయ్య చౌదరికి ప్రోటెం స్పీకర్గా చంద్రబాబు ఎంపిక చేసినట్లుగా సమాచారం. మరి రేపటి రోజున గవర్నర్ సమక్షంలో ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి రేపటి రోజున అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: