ఏపీలో మరో 25 ఏళ్ళు టీడీపీదే హవా...ఇక వైసీపీ తట్టుకోలేదు?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసింది. తెలుగుదేశం కూటమికంటే చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది అనడం బెటర్. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏపీలో... టిడిపి పార్టీ స్థానం సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 135 అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని... ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది టిడిపి పార్టీ.
 
గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో తెలుగుదేశం పార్టీ అనేక కష్టాలను అనుభవించింది. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ... ఐదేళ్లు తిరిగేసరికి చరిత్రను తిరగరాసింది టిడిపి పార్టీ. 135 స్థానాలు దక్కించుకున్న చంద్రబాబు నాయుడు... వరుసగా నాల్గవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీనికి తగ్గట్టుగానే.... మొట్టమొదటిసారిగా  నారా లోకేష్ ప్రజా ఆశీర్వాదం తీసుకున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో ఏకంగా 90 వేలకు పైచిలుకు  ఓట్ల మెజారిటీతో... నారా లోకేష్ గ్రాండ్ విక్టరీ కొట్టాడు. ఏపీలో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ మెజారిటీ సంపాదించిన నాయకుడిగా నారా లోకేష్ రికార్డు లోకి ఎక్కాడు. అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నడిపించే స్థాయికి నారా లోకేష్ ఎదిగాడు అన్నమాట. అటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో... మరో ఐదు ఏళ్ల పాటు చంద్రబాబు కూడా కృషిగా ఉంటారు.

 చంద్రబాబు కుటుంబంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక ఇటు..  మంగళగిరి నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తూ... భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు నారా లోకేష్. పార్టీలో యూత్ ను మాత్రమే... ప్రోత్సహిస్తూ కేబినెట్ కూర్పు కూడా... చంద్రబాబు సెట్ చేశారు. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ మరో 25 సంవత్సరాల పాటు... మంచి ఫామ్ లో ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణలో చేసిన మిస్టేక్స్ ఏపీలో చేయకుండా.... ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటున్నారు చంద్రబాబు అలాగే నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: