జగన్ మెడకు మరో కేసు..ఏకంగా వెస్టిండీస్ తోనే ?
ఋషికొండపై లగ్జరీ గదులను జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం నిర్మించాడని... ఏకంగా ఆ భవనాల కోసం 450 కోట్లు జగన్ ఖర్చు చేశాడని టిడిపి చెబుతోంది. అయితే ఈ రెండు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే... మరో అంశం తెరపైకి వచ్చింది. అదే గనుల శాఖలో జరిగిన పెద్ద స్కాం. గనుల శాఖలో గ్యారంటీలు ఉంటాయి. ఆ గ్యారంటీలు ఇండియన్ బ్యాంకుల ద్వారా... చేయాల్సి ఉంటుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో... విదేశీ బ్యాంకులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి.
గనుల శాఖలో టెండర్లను దాదాపు వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలకు... వారి సన్నిహితులకు దక్కాయట. అయితే ఆ టెండర్లు వేసేటప్పుడు... ఇండియన్ బ్యాంకులు కాకుండా వెస్టిండీస్ దేశానికి చెందిన బ్యాంకులను పొందుపరిచారట కాంట్రాక్టర్లు. వెస్టిండీస్ దేశానికి చెందిన యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కు సంబంధించిన గ్యారెంటీలను మాత్రమే టెండర్ వేసిన వారు సమర్పించారట. అందులో గనుల శాఖ పిలిచిన సీనియర్ ఏజ్ వసూళ్లకు సంబంధించి... 6 టెండర్లకు దాదాపు 80 కోట్లు ఈ బ్యాంకుకు చెందినవే.
అలాగే ఎస్పీడీఎస్ లో 19 పనులకు గాను దాదాపు 300 కోట్లు, ఈపీడీసీఎల్ లో 4 పనులకు 37 కోట్లు, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఓ పని కోసం ఏకంగా 64 లక్షల వరకు... ఈ విదేశీ బ్యాంకు గ్యారంటీలను సమర్పించారట. అయితే ఇప్పుడు ఆ డబ్బులను... టెండర్లు దక్కించుకున్న వారు... ఇవ్వకపోతే వెస్టిండీస్ దేశానికి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం వసూలు చేయాల్సి ఉంటుంది. మన దేశ బ్యాంకుల్లోనే డబ్బులు వసూలు కావడం లేదు అంటే.. విదేశాల్లో ఉన్న బ్యాంకు బకాయిలను ఎలా తీసుకురావాలని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై... చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తోంది.