టీడీపీ స్కెచ్: ఆ 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారా?
జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కీలక నేతలు మినహా ఏ ఒక్క వైసీపీ సీనియర్ నేతలు విజయం సాధించలేకపోయారు. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు లాంటి కీలక నేతలు కూడా... ఓటమిపాలయ్యారు. ఇదే సమయంలో... ఉన్న ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్తామని అప్పుడప్పుడు టిడిపి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తాజాగా మాట్లాడుతూ...జగన్ దుర్వినియోగం చేసిన ప్రజా ధనాన్ని అతని సొంత ఖర్చుల నుంచి వసూలు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు చట్టాలు చేయాలని చంద్రబాబును కోరుతున్నామన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఈవీఎంలపై గతంలో తానేం మాట్లాడాడో ఓసారి జగన్ వినాలని... ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాల్లోకి వస్తే.. ఆ 10 మందైనా జగనుకు మిగులుతారని హెచ్చరించారు. లేదంటే ఆ 10 మంది వెళ్లిపోతారని చురకలు అంటించారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్.
జగన్ తీరు తన తీరు మార్చుకోకుంటే వైసీపీ కూడా మూడు నెలల్లో మూతపడతుందన్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ తన ఆక్రమ కేసుల విచారణకు జగన్ వెళ్లలేదని.. జగన్ ఇక జైలుకెళ్లకుండా తప్పించుకోలేడని వెల్లడించారు. జగన్ అండ చూసుకుని ప్రతీ అధికారి చేసిన అవినీతిని కక్కిస్తామని హెచ్చరించారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఇక ఏపీలో వైసీపీ పార్టీ మనుగడ కష్టమేనని హెచ్చరించారు. జగన్ బతుకే ఓ అబద్ధం.. జీవితమంతా మోసాల మయం.