అప్పుడు అన్నాడు... ఇప్పుడు పడుతున్నాడు... పీక్స్ కి చేరిన ఏపీ పొలిటికల్ ర్యాగింగ్..?

Pulgam Srinivas
మనం క్లాస్ రూమ్ రాగింగ్ చూసుంటాం, హాస్టల్ రాగింగ్ చూస్తుంటాం, కాలేజ్ రాగింగ్ చూసుంటాం, కానీ పొలిటికల్ ర్యాగింగ్ గురించి వినడం, కానీ చూడడం కానీ చూసి ఉండం. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతుంది. వైసిపి పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు టిడిపి పార్టీని దాని అధినేత అయినటువంటి చంద్రబాబును మరి కొంతమంది పై విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే.

అలాంటి వారిలో కొడాలి నాని ఒకరు. ఈయన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పై అనేక విమర్శలు చేశారు. అందులో భాగంగా ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు. ఆయన పోటీ చేసి గెలవమని చెప్పండి. ఆయన గెలిచినట్లు అయితే నేను రాజకీయాలను వదిలేసి ఆయన బూట్ల దగ్గర ఉంటూ ఊడిగం చేస్తాను అని చెప్పారు. ఇక వైసిపి ఓడిపోయి కొడాలి నాని గెలిచిన ఈ వ్యాఖ్యలను జనాలు అంతా పట్టించుకునే వారు కాదేమో కాకపోతే వైసిపి ఓడిపోయింది.

అలాగే కొడాలి నాని కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదవ ప్రయత్నంలో ఆయన ఓడిపోయాడు. ఓటమంటే తెలియకుండా రాజకీయాలలో ముందుకు సాగిన కొడాలి నానికి మొదటి అపజయం దక్కింది. దానితో ఈయనపై ఏపీ నేతల ర్యాగింగ్ తీవ్ర స్థాయికి చేరిపోయింది. ఏకంగా ఫ్లెక్సీలు కట్టిమరి ఎక్కడ దాక్కున్నావు... బయటికి రా... అప్పుడు మాటలు చేశావు కదా ఇప్పుడే ఎందుకు బయటకు రావడం లేదు అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. మరి అప్పుడు అలా అన్నవారు ఇప్పుడు ఇతరులతో అనేక మాటలు పడుతున్నారు. ఏదేమైనా కేవలం కొడాలి నాని మాత్రమే కాకుండా వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీపై విమర్శన అస్రాలతో దాడి చేసిన ఎంతోమంది ని కొంతమంది ప్రస్తుతం టార్గెట్ చేస్తూ ర్యాగింగ్ చేస్తున్నారు. మరి ఇది ఏ దశకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kn

సంబంధిత వార్తలు: