ఇక లెక్కలు తేల్చుకోవలసింది వైసీపీ, జనసేననే!

Suma Kallamadi
తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి అద్భుతమైన మెజారిటీని సాధించింది. ఎంతలాగా అంటే, టీడీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయం సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం 144 అసెంబ్లీ సీట్లకు గాను 135 దక్కాయి. అంటే కేవలం 9 చోట్ల మాత్రమే ఆ పార్టీ ఓడింది. అదే విధంగా 17 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే 15 దక్కాయి. ఈ విజయం కేవలం అయిదేళ్లకు మాత్రమే పరిమితం కాకుండా టీడీపీకి మరో నలభై ఏళ్లకు సరిపడా ఎనర్జీని ఇచ్చింది. బాబు మరో అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేతగా కొనసాగుతారు. ఈలోగానే తన వారసుడిగా నారా లోకేష్ ని తీర్చిదిద్దుతారు. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచి చాలా సేఫ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది.
ఇటువంటి తరుణంలో టీడీపీకి ఆపోజిట్ గా ఉండి ఏపీలో ఆల్టర్నేషన్ పార్టీగా ఉండేది ఎవరు అన్నదే ఇపుడు ప్రశ్నగా ఉంది. ఇక్కడ తేల్చుకోవాల్సింది వైసీపీ జనసేనలు మాత్రమే అని అంటున్నారు విశ్లేషకులు. జనసేన ఈ రోజుకు కూటమిలో ఉన్నా రానున్న కాలంలో ఏపీలో అధికారంలోకి రావాలని ఆశతోనే పనిచేస్తోంది కాబట్టి జనసేన టార్గెట్ 2029 అని ప్రచారంలో ఉంది. మరోవైపు అయిదేళ్ళ పాటు పాలించి 2024లో ఓడిన వైసీపీ టార్గెట్ కూడా 2029 ఎన్నికలే. ఈ ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతాయి కనుక ఈసారి వైసీపీ పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఒకవేళ ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయితే తన ఉనికికే ఇబ్బంది. జనసేన కూడా ఇపుడు ఏపీలో పటిష్టంగా ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీకే టార్గెట్ పెడతారు. ఈ తరుణంలో ఏపీలో టీడీపీని ఢీ కొనే పార్టీలలో జనసేన ముందు ఉంటుందా వైసీపీ ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. రానున్న రోజులలో వైసీపీ టీడీపీతో తలపడాలీ అంటే ముందు జనసేనతో పోటీ పడాలి. అంటే సెమీస్ గెలవాలి ఆ మీదట ఫైనల్స్ అన్న మాట. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో సెమీస్ లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపైన చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా వైసీపీకి ఇది అత్యంత పరీక్షా సమయం అని అంటున్నారు. ఏ మాత్రం ఉదాశీనంగా ఉన్నా వైసీపీ ప్లేస్ ని జనసేన ఆక్రమించేసే ప్రమాదం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: