బాబు స్కెచ్ : వారికే టీటీడీ ఛైర్మన్...వంగవీటికి భారీ ఆఫర్ ?
అయితే.. ఉత్తరాంధ్రకు చెందిన చాలామంది నేతలు.. ఈసారి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రి పదవులు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వారికి చాలానే వచ్చాయి. ఇటు పళ్ళ శ్రీనివాస్... ఉత్తరాంధ్రకు చెందిన వాడే. అతనికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఉత్తరాంధ్రకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడికి అసెంబ్లీ స్పీకర్ పదవి రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. మొదట్లో గోరంట్ల బుచ్చయ్య, రఘురామకృష్ణ రాజు పేర్లు వినిపించినా కూడా అయ్యన్నపాత్రుడికి ఆ చాన్స్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఇక ఇటు జనసేన పార్టీ సభ్యులకు...డిప్యూటీ స్పీకర్ పదవి రానున్నట్లు సమాచారం. ఒకవేళ వాళ్లు కాదనుకుంటే... కళా వెంకట్రావు లాంటి సీనియర్ నేతలకు డిప్యూటీ స్పీకర్ రాబోతుందట.
ఇక అటు టీటీడీ చైర్మన్ పదవి అశోక్ గజపతిరాజు లేదా రఘురామకృష్ణ రాజుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి సామాజిక వర్గం నుంచి... మంత్రి పదవులు ఎవరికి రాలేదు. అందుకే రఘురామకృష్ణ రాజుకు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అటు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమ్మ సామాజిక ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు తీసుకురావడంలో వంగవీటి సక్సెస్ అయ్యారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారట. మరి దీనిపై మరి కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.