ముద్రగడ సంచలనం: మా కుటుంబ సభ్యులను చంపేయండి.. ?
దీంతో అప్పటినుంచి... తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు... అందరూ దారుణంగా ముద్రగడని ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ... ముద్రగడను టార్చర్ చేస్తున్నారు. ఇక... ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టార్చర్ మరింత ఎక్కువగా అయింది. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మేము అనాధలం ఎవరు అడ్డుకోరు... ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమా లు వదిలేసి ప్రజాసేవ చేయాలని డిమాండ్ చేశారు. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరానని తెలిపారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి. నా సవాల్ కు కట్టుబడి నా పేరు మార్చుకున్నాను... పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి.
వైసీపీ సానుభూతిపరులు ఇళ్లపై దాడులు చేస్తున్నారు వెంటనే ఆపాలని కోరారు. నేను చేతకాని వాడిని అసమర్థుడు ను కాబట్టి పవన్ కళ్యాణ్ ను ఉద్యమం చేయాలని కోరానని స్పష్టం చేశారు. కేంద్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కోసం పోరాడాలని కోరారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి.