సీఎం కేజ్రీవాల్: బెయిల్ రద్దు.. ఆందోళనలో నేతలు..!
జూన్ రెండవ తేదీన తీహార్ జైలు అధికారుల ముందు క్రేజీవాల్ లొంగిపోవడం జరిగింది.. ఈ రోజున జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని నిన్నటి రోజున వార్తలు ఎక్కువగా వినిపించాయి. దీంతో చాలామంది నేతలు కార్యకర్తలు సైతం సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా క్రేజీవాల్ కు షాక్ తగులుతూ బెయిల్ రద్దు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో ఇచ్చిన బెయిల్ హోల్డ్ చేసినట్లు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినట్లు సమాచారం.నిన్నటి రోజున షరతులతో కూడిన బెయిల్ ని సైతం కోర్టు మంజూరు చేసింది.
క్రేజీవాల్ బెయిల్ పైన ఈడి హైకోర్టును సైతం ఆశ్రయించగా బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పడంతో తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ కోరిందట. దీంతో హైకోర్టు కూడా క్రేజీవాల్ కు ఇచ్చినటువంటి బెయిల్ ని కూడా నిలిపివేసింది. వాస్తవానికి ఈ రోజే క్రేజీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల అవ్వబోతూ ఉండగా బెయిల్ హోల్డ్ లో పెట్టడంతో జైలులోనే సీఎంగా ఉండనున్నారు క్రేజీవాల్.. మరి ఈ విషయం అటు కార్యకర్తలను నేతలను సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది. మరి కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో చూడాలి.