రాంగ్ డైరెక్షన్ లో షర్మిల.. ఇలాంటి రాజకీయాలు చేస్తే పొలిటికల్ కెరీర్ కే ప్రమాదం!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలను, ఆమె రాజకీయాలను పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరు. షర్మిల వ్యక్తిగత స్వార్థంతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేయాలని, మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని ఎవరూ భావించడం లేదు. జగన్ టార్గెట్ గా మాత్రమే షర్మిల విమర్శలు కొనసాగుతూ రాజకీయాలు సాగుతున్నాయి. జగన్ కు పొలిటికల్ గా నష్టం చేయాలనే ఆమె భావిస్తున్నారు.
 
మరోవైపు కాంగ్రెస్ లో సాధారణంగా అధిష్టానం కమిటీల రద్దు తరహా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే షర్మిల మాత్రం సొంతంగా అదే తరహా నిర్ణయాలు తీసుకుని వార్తల్లో నిలిచారు. షర్మిల ఈ విధంగా చేయడంతో ఒక టీం సెంట్రల్ కమిటీకి ఫిర్యాదు చేయగా షర్మిల మాత్రం పార్టీ ఆఫీస్ లోకి ఎవ్వరినీ రానివ్వద్దంటూ ఆర్డర్ వేశారు. షర్మిల నిర్ణయాల వల్ల వర్కింగ్ ప్రెసిడెంట్లు సైతం ఆఫీస్ లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
 
షర్మిల నిర్ణయాల విషయంలో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిల్ల కాలువలు అన్నీ సముద్రంలో కలవాలి అంటూ షర్మిల చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 సంవత్సరంలో కాంగ్రెస్ అనే పెద్ద సముద్రాన్ని నిలువునా చీల్చుకుంటూ తీరానికి ఎగిసిపడిన సునామీ, తుఫాన్ వైసీపీ అంటూ నెటిజన్లు చెబుతున్నారు.  
 
కాంగ్రెస్ లో షర్మిల ఎంతకాలం ఉన్నా ఆమె రాజకీయ జీవితం ఎదుగూ బొదుగు లేకుండా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిలకు జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. షర్మిల తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని నెటిజన్లు చెబుతున్నారు. షర్మిల రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. షర్మిలను రాజకీయ నేతలు సైతం ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. షర్మిల తీసుకున్న నిర్ణయాల వల్ల అంతిమంగా నష్టపోయేది తన కుటుంబమేనని సోషల్ మీడియాలో  కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: