ఏపీ అసెంబ్లీ : కూటమితోనే చంద్రబాబుకు బలం.. అదే కూటమి విచ్చిన్నమైతే..?
* అదే కూటమి విచ్ఛిన్నం అయితే టీడీపీ పరిస్థితి ఏంటో ?
*చంద్రబాబు చాణక్య రాజకీయం ఫలిస్తుందా ..?
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి అద్భుత విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం అందుకుంది.నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు.అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసారు.రాష్ట్రంలో చంద్రబాబు ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం కూటమి.గత ఎన్నికలలో కేవలం 23 సీట్లు సాధించిన టీడీపీ ఇటీవల ఎన్నికలలో ఇంతటి ఘనవిజయం సాధించడానికి బలమైన కూటమే కారణమని అందరికి తెలుసు.గత ఎన్నికలలో టీడీపీ ,వైసీపీ ని విమర్శిస్తూ ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కేవలం ఒకే ఒక సీటు సాధించింది.అయితే గత ఎన్నికలలో జనసేన పార్టీ సీట్లు సాధించకపోయినా టీడీపీకి పడే ఓట్లను చీల్చింది.దీనితో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.