విశాఖ వైసీపీ కార్యాలయం కూల్చివేతకు స్కెచ్..నోటీసులు జారీ ?
ఆ తర్వాత రుషికొండ ప్యాలెస్ గురించి విమర్శలు చేసింది టిడిపి. ఇక ఇప్పుడు వైసిపి పార్టీ... కార్యాలయాలను టార్గెట్ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. మొట్టమొదటగా తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నెలమట్టం చేసింది. ఉదయం 5 గంటల సమయంలోనే..బులడోజర్లతో తాడేపల్లి వైసిపి కార్యాలయాన్ని.. కూల్ చేశారు ఉన్నతాధికారులు.
ఇవాళ ఉదయం ఈ విధ్వంసం జరగక... అది మరువక ముందే... జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. విశాఖపట్నంలోని... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు అధికారులు. విశాఖ మున్సిపల్ అధికారులు... ఈ నోటీసులు అందించడం జరిగింది. విశాఖ ప్రాంతంలోని ఎండాడలో సర్వే నెంబర్ 175/4 లో కార్యాలయం నిర్మిస్తోంది వైసిపి పార్టీ. దాదాపు ఈ కట్టడం పూర్తికావస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో విశాఖపట్నం మున్సిపాలిటీ నుంచి కాకుండా అనుమతుల కోసం వి ఎం ఆర్ డి ఏ కు దరఖాస్తు చేయడం... అక్కడ పర్మిషన్లు రాకముందే నిర్మాణాలు పూర్తి చేయడంపై... జీవీఎంసీ సీరియస్ అయింది. దీనిపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ కట్టడాలపై వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని వైసిపి పార్టీ కార్యాలయానికి... నోటీసులు ఇష్యూ చేసింది జీవీఎంసీ యాజమాన్యం. దీంతో వైసిపి పార్టీ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరి జీవీఎంసీ అధికారులు ఇచ్చిన నోటీసులపై వైసీపీ పార్టీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.