ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 70 వేల ఉద్యోగాలు..?

Divya
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకు వచ్చిన వాలంటరీ వ్యవస్థ ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వానికి పెద్దగా మేలు చేసినట్టుగా కనిపించలేదు.. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో 2,54,832 మంది వాలంటరీలు ఉండగా ప్రస్తుతమైతే ఇందులో 1,26,659 మంది పనిచేస్తున్నట్లు తేలుస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు 1,08000 మంది రాజీనామా చేశారు. దీంతో ఈ పోస్టులన్నీ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో భాగంగా టిడిపి అధికారంలోకి రావడంతో ఈ పోస్టులన్నీ ఇప్పుడు భర్తీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఎన్నికలకు ముందు చంద్రబాబు వాలంటరీలకు పదివేల రూపాయలు జీతం ఇస్తామంటూ తెలియజేయడంతో చాలామంది టీడీపీ పార్టీకి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో వైసిపి పార్టీ కేవలం పదవ తరగతి అర్హత ఉండి 45 ఏళ్ల లోపు ఉండే నిరుద్యోగులకు సైతం ఈ పోస్టులను ఇచ్చేది. అయితే ఇప్పుడు తాజాగా టిడిపి ప్రభుత్వం నూతన నియమాలను చేపట్టిన తర్వాత పదివేల రూపాయల జీతాన్ని పెంచబోతున్నట్లు తెలుస్తోంది.

వాలంటరీ ఉద్యోగాలకు కావలసిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే.. పదవ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ.. ఆధార్ కార్డు, క్యాస్ట్, బ్యాంకు పాస్ బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్.. అయితే ఈ నూతన వాలెంటరి పోస్టులను గతంలో మాదిరిగా ఇంటర్వ్యూతో నిర్వహిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.

గతంలో ఒక్క వాలంటరీలకు కేవలం 50 ఇండ్లు కేటాయించేవారు. కానీ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 300 ఇండ్లకు ఒక వాలంటరీని కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అఫీషియల్ గా ఇంకా వెలువడలేదు. గతంలో వాలంటరీలు కేవలం వారానికి మూడు రోజులు మాత్రమే సచివాలయంలోకి వెళ్లేవారు కానీ నూతన నియామకం నిబంధనల ప్రకారం ప్రతిరోజు సచివాలయం , మండలంలో నిర్వహించే మీటింగులకు కచ్చితంగా ఉండాల్సిందే.. అంతేకాకుండా వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా చేయాలి. ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లోనే చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: