ఏపీ: పింఛన్ పెంపు పై ఏపీ గవర్నమెంట్ తాజా ఆదేశాలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది . దీంతో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మేని పోస్టులో ప్రకటించినట్టుగా అన్ని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. పలు రకాల విషయాల పైన సంతకాలు కూడా చేశారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా వృద్ధులు ఎంతగానో ఎదురు చూస్తున్న పెన్షన్ పెంపు పథకాన్ని కూడా అమలు చేశారు. వచ్చేనెల 1వ తారీకు నుంచి అందుకు సంబంధించి పెంచిన డబ్బులను ఇచ్చే విధంగా సంతకం కూడా చేశారు చంద్రబాబు. ఈ నెల నుంచి 4 వేల రూపాయలు కల్పిస్తూ జూలై 1న పంపిణీ చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారు.

అయితే ఈ డబ్బులను వాలంటరీ తో పంపించాలా లేకపోతే ప్రభుత్వ సిబ్బందితో ఇవ్వాల అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలోనే పెన్షన్ పంపిణీ పైన ఆంధ్రప్రదేశ్ తాజాగా కొన్ని ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా.. పెన్షన్ మూడు నెలల నుంచి వెయ్యి రూపాయలు చొప్పున అమలు చేయాలని నిర్ణయించారు. ఇలా పెరిగిన వెయ్యితోపాటు మరో నాలుగు వేలు మొత్తం కలుపుకొని జూలై 1వ తారీఖున 7వేల రూపాయలు చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నారు.
తాజాగా అందుకు సంబంధించి పంపిణీ పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు కీలకమైన ఆదేశాలను అందించారు అలాగే నూతన పింఛన్ పాస్ పుస్తకాలను కూడా నగదు తో పాటు అందించాలని ఆదేశాలను జారీ చేశారు. దివ్యాంగుల పింఛన్లు 3000 నుంచి 6 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిస్థాయి దివ్యాంగులకు 5 నుంచి 15000 కు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడే వారికి ఐదు నుంచి పదివేలకు పెంచారు. అయితే ఇలా పెంచిన మొత్తాన్ని వాలంటరీల ద్వారా పంపిణీ చేయాలా ప్రభుత్వ సిబ్బంది ద్వారా పంపించాలా అనే విషయం ఈనెల 24న జరిగే మంత్రి మార్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నరట. అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నగదు పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు జులై 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: