కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం, బిజెపి లతో కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగిన విషయం మనకు తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు దక్కాయి. పవన్ కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో పిఠాపురం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవగా, తన పార్టీ నుండి పోటీ చేసిన అందరూ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు కూడా గెలిచారు. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా భారీ మొత్తంలో సీట్లు రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకారం చేశారు.
జనసేన పార్టీకి భారీ మొత్తంలో సీట్లు రావడం, పొత్తులో పవన్ కళ్యాణ్ కీలక వ్యక్తిగా వ్యవహరించడంతో పవన్ కళ్యాణ్ కు కూడా తెలుగుదేశం పార్టీ అత్యంత గౌరవాన్ని ఇచ్చింది. అలాగే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవులను కూడా ఇచ్చింది. ఇకపోతే ఈయన తాజాగా తన బాధ్యతలను నిర్వర్తించడం కూడా మొదలు పెట్టారు. దానితో ఈయనను కొంత మంది టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు కలిసి తమ సమస్యలను విన్నవించుకోబోతున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయంలోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలు అయినటువంటి దిల్ రాజు, అశ్విని దత్, నాగ వంశీ మరియు మరి కొంత మంది పెద్ద నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్. జ రేపు విజయవాడలో కలిసి టికెట్ రేట్ల పెంపు , అదనపు షో లు మరియు మరికొన్ని విశాయలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినీ నటుడే కావడం వల్ల వీరి సమస్యలకు త్వరితగతన పరిష్కారం లభించే అవకాశం చాలా వరకు ఉంది.