ఏపీలో ఇంటింటికీ పింఛ‌న్లు సంగతి ఇక లేనట్టేనా?

Suma Kallamadi
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డవేళ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. ఈ తరుణంలో తాజాగా పింఛన్ల అంశం తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రో 7 రోజుల్లో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేయాల్సి ఉంది. జూలై 1వ తేదీ కాకపోయినా మ‌రుస‌టి రోజైనా పింఛ‌న్లు పంచడం తప్పనిసరి. దానికోసం వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు, వితంతువులు కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి కూడా ఇంటింటికీ పంపిణీ చేసే అవ‌కాశం ఉంటుందా లేదా అనే అనుమానం అందరికీ కలుగుతోంది. విషయం ఏమిటంటే ఇదివరకు వారికి పింఛన్లు పంచడంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ కీలక పాత్ర పోషించేది. కానీ నేడు వాలంటీర్ వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు.
ఏ రకంగానైనా పింఛ‌న్లు పంపిణీ బాధ్య‌తను చంద్ర‌బాబు తీసుకుంటానని చెప్పినప్పటికీ సొమ్ములు స‌మ‌కూర్చాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకోవిషయం ఏమిటంటే ఇంటింటికీ పంపిణీ చేసే విష‌యంలో మాత్రం ఇంకా బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్నట్టుగా దాఖలాలు కనబడడంలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే గ‌త మేలో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను అధికారిక విధుల నుంచి ఎన్నిక‌ల సంఘం దూరం పెట్టడంతో వ‌లంటీర్లు ఇంటికే పరిమితం అయ్యారు. మరికొంద‌రు రాజీనామాలు చేశారు. ఫ‌లితం వ‌చ్చి.. స‌ర్కారు ఏర్ప‌డి 10 రోజుల‌కు పైగానే అయినా.. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించేదీ లేదు, అలాగని వారిని తీసేది లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పింఛన్లు అంశానికి సంబంధించి మ‌రో 7 రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏం చేస్తారు? అనేది ఇపుడు చాలా ఆస‌క్తిగా మారింది. ఈ సారికి కూడా బ్యాంకుల్లోనే వేస్తారా? లేక‌.. ఏం చేస్తారు? అనేది చంద్ర‌బాబు మరో రెండు మూడు రోజుల్లో ప్ర‌క‌టించాల్సి ఉంది. ఎలానూ రెండు మాసాలుగా బ్యాంకుల‌కు వెళ్లి తెచ్చుకున్నారు కాబ‌ట్టి.. పింఛ‌న‌ర్లు అల‌వాటు ప‌డి ఉంటారు. దీంతో ఈసారి ఎలాంటి ఇబ్బందులు రాక‌పోవ‌చ్చు అని కొందరు అంటున్నారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ పూర్తిస్థాయిలో ఏర్ప‌డే వ‌ర‌కు.. జూలై నెల వ‌ర‌కు ఇలానే చేస్తార‌ని మరికొందరు ఫీల్ అవుతున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: