HBD కోటిరెడ్డి : 14 ఏళ్ల ఇండియా హెరాల్డ్ సక్సెస్ స్టోరీ వెనక కోటిరెడ్డి..!
తొలుత తెలుగు కు మాత్రమే పరిమితమైన హెరాల్డ్.. సినిమా రివ్యూల్లో ఉన్నది ఉన్నట్టు రాస్తూ.. ఆయా సినిమాలపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొడుతూ.. వీక్షకుల ఆదరాభిమానాలను చూరగొనడమే కాకుండా.. తనపై వీక్షకుల్లో విశ్వాసాన్ని ప్రోది చేసింది. ఏ పోర్టల్ ఓపెన్ చేసినా నిజమైన సినిమా సమీక్ష భూతద్దంలో పెట్టుకుని వెతికినా కనపడదు. అనేక వెబ్ పోర్టల్స్, మెయిన్ మీడియా ప్రకటనలకు బందీగా మారి.. అసలు సిసలు సమీక్షకు బంది అయిపోయాయి. హెరాల్డ్ మాత్రం సినిమా ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టు బండకేసి బాదేసేది.
ఫలితంగా 14 ఏళ్ల కిందట ప్రారంభమైన ఏపీ హెరాల్డ్ ప్రయాణం.. అనతి అనేకాలంలోనే అనేక మైలురాళ్లను తన ఖాతాలో వేసుకుని.. ఇండియా హెరాల్డ్ అనే శిఖర సమానస్థాయికి చేరింది. దీని వెనుక కోటిరెడ్డి కష్టం.. ఆయన వ్యూహం వంటివి కనిపిస్తాయి. ప్రస్తుతం ఇండియా హెరాల్డ్.. ఒక్క తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, తమిళం, కన్నడం, హిందీ, బెంగాలీ, మళయాళం ఇలా.. పలు భాషల్లో నిత్యం కోట్ల మంది పాఠకులకు, వీక్షలకు వార్తల విందు చేస్తోంది. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. మరెంతో మందికి ప్రత్యక్షంగా మార్గదర్శనం చేస్తోంది.
ప్రస్తుతం ఇండియా హెరాల్డ్ వెబ్‌పోర్టల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ధీటుగా ఫాలోవర్లను కలిగి ఉండడంతో పాటు ప్రతి రోజు లక్షల్లోనే వ్యూస్ సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదంతా కూడా కోటిరెడ్డి వ్యూహాల నుంచి వచ్చిన సక్సెస్ అని చెప్పాలి.