బెంగళూరుకు జగన్ జంప్...10 ఏళ్ల తర్వాత..?
సొంత వైసిపి నేతల టార్చర్ వల్లే బెంగళూరుకు జగన్ వెళ్లిపోయినట్టు ఎల్లో మీడియా ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల కిందట పులివెందులకు జగన్ మోహన్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజా దర్బార్ నిర్వహించి... పులివెందుల ప్రజలను కలిశారు జగన్. అయితే... ఈ నేపథ్యంలోనే జగన్ ఇంటి పై వైసిపి కార్యకర్తలు అలాగే పులివెందుల ప్రజలు దాడి చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేసింది.
ఇక ఇప్పుడు వైసీపీ నేతల టార్చర్ భరించలేక జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లినట్లు... చెబుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల వ్యవహారాల్లో... తేడాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ బిల్లులు తెలుగుదేశం ప్రభుత్వం... రిలీజ్ చేయలేదని... జగన్ పై ఒత్తిడి తెస్తున్నారట వైసీపీ నేతలు. ఇందులో కాంట్రాక్టర్లు కొంతమంది కౌన్సిలర్లు కూడా ఉన్నారట.
వీరందరూ పులివెందులలోని జగన్ ఇంటి ముందు... పెద్ద గొడువే చేశారట. అయితే పులివెందులలో ఈ గొడవలు భరించలేక.. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు జగన్ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లినట్లు.... వైసిపి పార్టీ అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. కానీ మీడియాలో మాత్రం... ఆయన బెంగళూరు వెళ్ళినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.