చంద్ర బాబు: షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు.. జగన్ కు ఊరట..!
దాదాపుగా 15 మంది మల్టీ సిస్టం ఆపరేటర్లు ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఆంధ్రాలో ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా న్యూస్ ఛానల్ ను బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సైతం తప్పు పట్టింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అయినటువంటి ఇలాంటి స్వేచ్ఛ హక్కును సైతం ఢిల్లీ హైకోర్టు చాటి చెప్పింది అంటూ NBF తెలియజేసింది. ఆంధ్రలో రాజకీయ నాయకత్వం మారిన తర్వాత కేబుల్ ఆపరేటర్ల పైన చాలా ఒత్తిడిని తీసుకువచ్చి మరి ఇలాంటి పనులు చేయిస్తున్నారు అంటూ ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా కూడా అవసరమని హైకోర్టు సైతం చాటి చెప్పింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ న్యూస్ ఛానల్ అని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అందుకే కోర్టు కూడా పునరుద్దించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ట్రామ్ నిబంధనల ప్రకారం చానాల్సిన సైతం ఆపి వేయకూడదని చట్ట విరుద్ధమని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్లుగా అవుతుంది అంటూ NBF గుర్తుచేసింది. ప్రతి ఒక్కరు కూడా కోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని అందుకు సంబంధించిన అధికారిక సంస్థలను కూడా NBF తెలియజేసింది. అయితే ఇది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కాస్త ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఈ ఛానల్ అన్ని కూడా వైసిపివే అంటూ బ్యాన్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఈ చానల్స్ అన్ని పునరుద్దించాలంటే ఢిల్లీ హైకోర్టు తెలిపింది.. జగన్ కు కాస్త ఊరట కలిగించిందని చెప్పవచ్చు.