ఇండియా చరిత్రలోనే తొలిసారి..స్వాతంత్ర్యం తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక ?
* యూపీఏ హయాంలో విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి
*2014 నుంచి మిత్ర పక్షాలకే డిప్యూటీ స్పీకర్ పదవి
భారతదేశ పార్లమెంట్ చరిత్రలో... సరికొత్త సంఘటన చోటు చేసుకుంది. దేశ పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవి కోసం.. ఎన్నికను నిర్వహించబోతున్నారు. లోకసభ స్పీకర్ విషయంలో... ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య... ఈసారి... ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు కూటముల మధ్య... చిచ్చు రగిలింది. దీంతో ఈ సారి లోక్ సభ పదవి కోసం ఎన్నిక అనివార్యమైంది. ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమి... రెండు కూడా తమ తమ అభ్యర్థులను నిలబెట్టాయి.
దీంతో దాదాపు 78 సంవత్సరాల తర్వాత... మన ఇండియాలో లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్నిక నిర్వహించబోతున్నారు. మన ఇండియాలో 1925 ఆగస్టు 24వ తేదీన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జే. పటేల్ అనే వ్యక్తి స్పీకర్ గా ఎన్నికయ్యారు. టి రంగాచారి పై రెండు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించి స్పీకర్ పదవి దక్కించుకున్నారు పటేల్. అంతేకాకుండా 1925 నుంచి 1946 మధ్య ఆరు సార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు నిర్వహించారు.
ఆ సమయంలో... అంటే 1946లో కాంగ్రెస్ నేత మౌలాంకర్... స్పీకర్గా బాధ్యతలు ఎన్నిక కావడం జరిగింది. అదే సమయంలో... సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీ... పార్లమెంట్ గా మారింది. ఇక 1952లో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత.... రాజ్యసభ అలాగే లోక్సభలో రెండు వేరువేరుగా ఏర్పడ్డాయి. ఇక అలా మన ఇండియాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోందన్న సంగతి తెలిసిందే. అంతే కాదు లోక్సభ స్పీకర్ పదవిని అధికార పక్షం తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇస్తున్నారు.
యూపీఏ హయాంలో కూడా.. విపక్షాలకు ఛాన్స్ ఇచ్చి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేవారు. కానీ 2014 సంవత్సరంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత... ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వకుండా... మిత్రపక్షాలకు ఇచ్చుకుంది. అయితే ఇప్పుడు... ఎన్డీఏ కూటమికి ఊహించని షాక్ తగిలింది. ఈ సారి లోక్‌సభ స్పీకర్ ఎంపికలో ట్విస్ట్ చేటుచేసుకుంది. భారత దేశ చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎంపికకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు ఏకగ్రీవమైన స్పీకర్ పదవికి ఈ సారి ఎన్నికలు జరగనుండగా విపక్షాల తరుఫున ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఎన్డీయే నుంచి ఓం బిర్లా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సారి ఎన్నిక అనివార్యమైంది.