వైసీపీ హారస్‌మెంట్ నుంచి టీమిండియా క్రికెటర్‌ను రక్షించిన లోకేష్..??

Suma Kallamadi
వైసీపీ అధికారంలో ఉన్న సంవత్సరాలలో, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఏపీ ప్రభుత్వ జోక్యం కారణంగా సమస్యలను ఎదుర్కొంది. దీని వల్ల ప్రభావితమైన క్రికెటర్లలో హనుమ విహారి కూడా ఉన్నాడు. విహారి అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్ జట్టుకు ఆడాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. క్రికెట్ లో రాణిస్తూ తెలుగు వారందరికీ గర్వకారణం అయ్యాడు. అయితే అలాంటి వ్యక్తికి మద్దతుగా నిలవడానికి బదులు వైసీపీ ప్రభుత్వం అతడిని బాగా టార్గెట్ చేసింది.
వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక ఆటగాడు మైదానంలో విహారి తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించాడు. ఈ ఆరోపణలతో వేధించడం వల్ల విహారి చాలా నొచ్చుకున్నాడు. అందుకే ఇటీవల ఆంధ్ర క్రికెట్ జట్టు నుంచి నిష్క్రమించాడు. ఏసీఏ నుంచి వైదొలగాలని వైసీపీ నేతలే విహారిపై ఒత్తిడి తెచ్చినట్లు తేలింది. వైసీపీ అధికారం కోల్పోవడం, టీడీపీ+ కూటమి గెలవడంతో విహారి కష్టాలు చాటకు సమయంలోనే తొలగిపోయాయి. హనుమ విహారి తన సమస్యకు కేవలం మూడు వారాల్లోనే పరిష్కారం కనుగొన్నారు. నారా లోకేష్ విహారి కేసుకు ప్రాధాన్యతనిస్తూ న్యాయం జరిగేలా చూశారు.
ఈరోజు భారత క్రికెటర్ విహారిని కలవడం చాలా సంతోషంగా ఉందని, గత ప్రభుత్వం ఆయనను రాజకీయంగా వేధింపులకు గురి చేసి, అవమానించి, ఆంధ్రా క్రికెట్‌ నుంచి వెళ్లగొట్టడం సిగ్గుచేటని, ఆయన్ను మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించి, మేకింగ్‌కు కృషి చేయాలని కోరానని లోకేష్ అన్నారు. తెలుగువారు గర్వించదగ్గ ఆయనకి మా పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
రంజీ సీజన్ కోసం విహారి తిరిగి ఆంధ్రా క్రికెట్ జట్టులోకి రావచ్చు. రాజకీయ జోక్యంతో స్థానిక తెలుగు ఆటగాడు ఆంధ్రప్రదేశ్ జట్టును విడిచిపెట్టడం బాధాకరం, అయితే లోకేష్ సత్వర చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించడం విశేషం. లోకేష్ చేసిన ఈ మంచి పనిని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇంకా వైసీపీ నేతలు వల్ల అన్యాయంకి గురైన ఎంతమంది క్రీడాకారులు తెలుసుకొని వారందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు. లోకేష్ ప్రజలతో మమేకమై చాలా మంది సమస్యలను తీరుస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన ఇంకెంత మందికి సహాయం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: