దేశ రాజకీయాల్లో సరికొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. లోక్సభ స్పీకర్ పదవిపై తీవ్ర గందరగోళం నెలకొంది. దాదాపు 70 సంవత్సరాల తర్వాత.. దేశంలో లోక్సభ స్పీకర్ కోసం ఎన్నిక జరుగుతోంది. అయితే 293 సీట్లు ఉన్న ఎన్డీఏ... మళ్లీ లోక్సభ పదవిని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అటు 234 సీట్లు ఉన్న ఇండియా కూటమి కూడా... ప్రాంతీయ పార్టీల సహాయం కోరుతోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ లోక్సభ ఎన్నిక లో ఎలాగైనా గెలవాలని... ప్రాంతీయ పార్టీలతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ సంప్రదించారట. ఏపీలో వైసిపి నాలుగు సీట్లు గెలిచి ఉంది. ఆ నాలుగు ఓట్లు కూడా ఎన్డీఏ అభ్యర్థికి పడేలా ప్రధాని మోడీ రంగం సిద్ధం చేశారట. భవిష్యత్తులో... అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర భరోసా కల్పించారట.
ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఆఫర్కు... జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసిపికి వ్యతిరేకంగా బిజెపి పనిచేసింది. అయినప్పటికీ మోడీకి మద్దతు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే జరిగితే... తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో... మోడీకి ప్రాంతీయ పార్టీల అవసరం కచ్చితం. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో కూడా.. వైసిపి లాంటి పార్టీలు అవసరం ఉంటుంది.
ఇటు ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ వైసీపీని చాలా ఇబ్బందులు పెడుతోంది. వైసిపి కార్యాలయాలను ధ్వంసం చేయడం, నేతలపై కేసులు పెట్టడం జరుగుతోంది. అయితే కేంద్రంలో పెద్దన్నగా ఉన్న మోడీ సపోర్ట్ ఉంటే.. చంద్రబాబు దూకుడును ఆపవచ్చని జగన్ అనుకుంటున్నారట. గత ఐదు సంవత్సరాలలో... మోడీకి ఇచ్చిన సపోర్ట్ మళ్ళీ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారట. తద్వారా చంద్రబాబు సర్కార్ చర్యల నుంచి తప్పించుకోవడం.. ఇటు మోడీ అండదండలతో ముందుకు వెళ్లడం జరుగుతుందని.. జగన్ భావిస్తున్నారట. దీంతో.. లోక్సభ స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపేందుకు.. సానుకూలంగా స్పందించారట జగన్.