2014 వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. అలా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దానితో రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో వైసీపీ పార్టీకి కూడా పర్వాలేదు అనే స్థాయిలోనే అసెంబ్లీ స్థానాలు దక్కాయి. 2019 వ సంవత్సరం ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ తగిలింది. వైసీపీ పార్టీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు దక్కాయి.
దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి తిరుగులేని పార్టీగా ఎదిగింది. 151 స్థానాలు దక్కడం వల్ల ప్రజలు మాకు అద్భుతమైన స్థాయిలో మెజారిటీని ఇచ్చారు. అనే ఉద్దేశంలో కొన్ని సందర్భాలలో వైసిపి పార్టీ నేతలు కాస్త ఓవర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక గడిచిన ఐదు సంవత్సరాలలో వైసిపి కొన్ని మంచి పనులు చేసిన అదే స్థానంలో నెగెటివిటీని కూడా సంపాదించుకుంది. సంక్షేమ పథకాలకు ప్రముఖ ప్రాధాన్యతను ఇచ్చినా కూడా రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుదలలో కాస్త వెనుక పడడం వల్ల ఈ పార్టీకి కాస్త నెగిటివ్ అయింది. అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా వైసిపి కి మరింత నెగిటివ్ ను చేసింది.
ఇక ఆ తర్వాత ఎలక్షన్లు దగ్గర పడిన సందర్భంలో కూడా మొదటి నుండి వైసీపీ పార్టీ నేతలంతా పోయినసారి 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాం. ఈ సారి రాష్ట్ర మొత్తం క్లీన్ స్విఫ్ట్ చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. స్వయంగా ఈ పార్టీ అధినేత అయినటువంటి జగన్ కూడా వై నాట్ 171 అనే స్లోగన్ తో జనాల ముందుకు వెళ్లాడు. కానీ చివరగా ఈ పార్టీకి కొన్ని రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అందులో కొంతమంది పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దానితో అసలు అసెంబ్లీలో వీరికి బలమే ఉండే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. వీరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాంటి అపజయానికి కారణం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.