ఏపీ: కడపలో పాఠశాలను మూయించిన టిడిపి నేత.. ఆందోళనలో విద్యార్థులు..!
వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజవర్గంలో టిడిపి నేతలు పైచాచిక మీది అన్నట్లుగా తెలియజేస్తున్నారు. చెరువు కింద పల్లె గ్రామానికి చెందిన కుచ్చం అనంతరెడ్డి కాలాపురానికి చెందిన కొండాయ పల్లెకు చెందిన నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. భారీ ఖర్చుతో భవనాలను సైతం నిర్మించారు.. సుమారు ఇందులో 600 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఈ పాఠశాలను టిడిపి నేత పొత్త నరసింహ కుటుంబానికి సమీపంలో ఉన్నది. ఎన్నికలలో ఆయన కుమారుడు పొత్త చైతన్య కృష్ణ కమలాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కౌంటింగ్ ముగిసిన వెంటనే సదరు టిడిపి నేత పాఠశాల యజమానిని దూషించడమే కాకుండా.. పాఠశాలను మూసివేయాలంటే ఒక హుక్కుమ్ను జారీ చేశారు. అధికారులను ఒత్తిడి చేయించి మరి పాఠశాలను ముగించి వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థు తల్లిదండ్రుల నుంచి పాఠశాల యాజమాన్యం పైన ఒత్తిళ్లు మొదలయ్యాయి.. వారికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నది. దీంతో ఆ పాఠశాల యజమాని కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ నియోజకవర్గం వారీగా ఇది చర్చనీయాంశంగా మారింది.