ఏపీ: అ రూల్ ప్రకారం వైసీపీ పార్టీకి చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది.. దీంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని చాలామంది తెలిపారు.. ప్రతిపక్ష హోదా రావాలి అంటే 18 సీట్లు రావాల్సి ఉంటుందట. మరి ఇలాంటి సమయంలో నిన్నటి రోజున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కి కూడా లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనే విషయం పైన కూడా ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ విషయం పైన గవర్నర్ కి కూడా లేఖ రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇటీవలే ప్రమాణస్వీకార విషయంలో ఆ విషయం చాలా క్లియర్ గా అర్థమయింది. ప్రతిపక్ష హోదా అంటే ముఖ్యమంత్రి తర్వాత మరి అంతటి స్థానం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వైసిపి పార్టీ హక్కులను కూడా దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోంది అంటూ గవర్నర్కు లేఖ వ్రాశారు. మరి చట్టం ఏం చెబుతోంది ఇవ్వొచ్చా ఇవ్వకూడదా.. అయితే 10% మంది  సభ్యులు ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు. లేకపోతే గుర్తించారు అని సహజంగానే అనుకుంటూ ఉంటారు.

అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక స్పెసిఫిక్ లా కూడా ఉన్నది.. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ఒక ఉత్తరంలో రాసి పంపించారు.. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మాడిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు , మండల సభ్యుల జీతభత్యాలు , పెన్షన్లు ఇది వారి యొక్క అనర్వత నియమాలను నివారించడానికి చట్టం. ఈ చట్టంలో క్లియర్గా 12B లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం..(గూగుల్ లో వెతికిన ఉంటుంది) ఎక్కడా కూడా 10% అనే పదం లేదట.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పిలుస్తారు..

11 మంది వైసీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నార్మల్ డెమొక్రటిక్ స్పిరిట్ ప్రకారం ఎంతమంది సభ్యులు ఉన్నారని కాదు.. అధికార పార్టీ తర్వాత మరే ఇతర పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీగా చూడాలట. గతంలో కూడా 10 శాతం లేకపోయిన కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటూ లేఖలో రాశారు జగన్.. 1984లో టిడిపి పార్టీకి 30మందే ఉన్నారు 543 సీట్లు లోక్సభలో ఉంటే హైయెస్ట్ గా 400కు పైగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని తెలిపారు.. అప్పట్లో ఏ జాతీయ పార్టీకి 30 సీట్లు కన్నా ఎక్కువ లేవు అంతకన్నా తక్కువ ఉన్నాయి అప్పుడు టిడిపి పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయింది అంటూ తెలిపారు. అలాగే 1994లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు రాగా అప్పుడు కూడా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్లో ఉన్నది అంటూ తెలిపారు. 2015 లో కూడా బిజెపి పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న ఢిల్లీలో అపోజిషన్ గా గుర్తించారని తెలిపారు.. దీన్ని బట్టి చూస్తే ఆపోజిషన్కు 10 శాతం ఉండాలి అనే అవసరం ఎక్కడ నిబంధనలో పెట్టలేదని.. ఒకవేళ ఇలా చేస్తే అది నిబంధనలకు విరుద్ధమంటూ కూడా లేఖలో జగన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: