సీమ ఎమ్మెల్యే గారి తాలూకా:బనగానపల్లె బాస్ బీసీ జనార్దన్ రెడ్డి.!
- వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో అద్భుత విజయం.
- అమ్మ మీద ఒట్టు రెండు సెంట్లు స్థలం ఇస్తా.
- పేద ప్రజల ఆశా కిరణం.!
కర్నూలు జిల్లాలోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బనగానపల్లె ఒకటి. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఎంతో మహిమాన్విత చరిత్ర ఉన్నటువంటి ఈ బనగానపల్లెలో అద్భుతమైన మెజారిటీతో బీసీ జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. అలాంటి బీసీ జనార్దన్ రెడ్డి తిరుగులేని లీడర్ గా కొనసాగుతూ వస్తున్నారు. మరి జనార్దన్ రెడ్డి గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు చూద్దాం.
సీమ సింహం జనార్దన్ రెడ్డి:
బీసీ జనార్దన్ రెడ్డి అంటేనే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. ఆయన ఎన్నికలు వచ్చాయని ప్రజల్లోకి రావడం తర్వాత ఇంట్లోనే ఉండి నాయకుడు కాదు. ఎప్పుడు ప్రజల కోసం ప్రజలకై, ప్రజాసేవకై పరితపిస్తూ ఉంటాడు. అలాంటి బీసీ జనార్ధన్ బనగానపల్లెకు బాస్ అయ్యాడు. అంతేకాకుండా కర్నూలు నియోజకవర్గంలోనే బనగాలపల్లి నియోజకవర్గం అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆశతో ఉన్నారు. అలాంటి బలగానపల్లె నియోజకవర్గం నుంచి ఎంతోమంది నేతలు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. నియోజకవర్గంలో పూర్తిగా రెడ్ల పెత్తనమే ఉంటుంది. వీళ్ళు ఏ పార్టీలో ఉన్న రెడ్డి నాయకులు మాత్రమే కాంటెస్ట్ చేస్తారు. అలాంటి ఈ బనగానపల్లె నియోజకవర్గంలో కాటసాని ఫ్యామిలీ కూడా బలంగా ఉంది. ఇక్కడి నుంచి కాటసాని రామిరెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందగా, 2019లో వైసీపీ నుంచి గెలుపొందారు, ఇక 2014లో బీసీ జనార్దన్ రెడ్డి టిడిపి నుంచి గెలుపొందారు. అలాంటి ఈ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి మరియు బీసీ జనార్దన్ రెడ్డి మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. ఈ పోటీలో బీసీ జనార్దన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు.
మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి:
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి పార్టీ నుంచి గెలిచిన వ్యక్తుల పేర్లమీద ప్రజలు రకరకాల స్టికర్లు పెట్టుకుంటున్నారు. నేను బనగానపల్లె జనార్దన్ రెడ్డి తాలూకా , పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కార్లపై, బైకులపై పెట్టుకుంటున్నారు. ఆ విధంగానే బనగానపల్లి లో గెలుపొందిన బీసీ జనార్ధన్ తాలూకా అంటూ కూడా చాలామంది రాయించుకున్నారు. అలాంటి సీమ సింహం జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చారు. ఈయన ఇచ్చిన హామీల్లో ప్రజలు ఎక్కువగా నమ్మింది మాత్రం "అమ్మ మీద ఒట్టు అందరికీ రెండు సెంట్లు స్థలం ఇస్తా" అంటూ ప్రజల్లో తన గలాన్ని వినిపించారు. ఈ విధంగా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో గెలుపొందడంతో చంద్రబాబు క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖకు మంత్రిగా ఎన్నికయ్యాడు. మరి చూడాలి ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా, లేదంటే నాకెందుకులే అని సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.