81 ఏళ్ల వయసులోనూ అధికారులను వణికిస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో..??
మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తనదైన రీతిలో ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గవర్నమెంట్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఆఫీసర్లను పేరుపేరునా పిలుస్తూ వారి తప్పులను ఎత్తిచూపుతూ కడిగిపారేసారట. దాంతో వైసీపీ రాజకీయ నేతలకు సేవలు చేసిన వారందరూ భయపడిపోతున్నారు. వీళ్లంతా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అలాగే ఇప్పటినుంచి ప్రజాసేవకే మొగ్గు చూపాల్సిందిగా ఆయన ఆదేశించారట. పద్ధతి మార్చుకోలేని వారు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోండి అంటూ కూడా ఆయన కరాకండిగా చెప్పేశారట.
గత ఐదేళ్లలో ఏమేం చేశారు ఫైల్స్ రూపంలో తన ముందు ఉండాలని కూడా వరదరాజులరెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి హయాంలో చాలా అక్రమాలు జరిగాయని, అవన్నీ ప్రభుత్వ అధికారుల సహాయంతోనే చోటుచేసుకున్నాయని వరదరాజులరెడ్డి కామెంట్లు చేస్తున్నారు. ఇకపై అలాంటివి జరగబోవు అని పారదర్శకంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కూడా ఈ నేత చెబుతున్నారు. చేసిన నిర్వాహకాలు చాలు అని ఇక వాటిని కంటిన్యూ చేస్తే తీవ్ర స్థాయిలో మాట్లాడారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ తో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.