కర్మఫలం వైసీపీని విడిచిపెట్టడం లేదు?
విషయం ఏమిటంటే పలువురు వైసిపి నేతలకు జనాల్లో ఎక్కడికి వెళ్లినా మద్దతు కొరవడుతోంది. గత నడవడిక కారణంగానే వారికి ఈ దుస్థితి కలిగిందని వేరే చెప్పనక్కర్లేదు. అవును, ఈ ప్రపంచానికి మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. గతంలో మాజీ మంత్రుల ముందు నిలబడి మాట్లాడడానికి భయపడిన జనం నేడు ధైర్యంతో తమ గొంతుక వినిపిస్తున్నారు. ఇకనైనా బుద్ధి మారి, మారు మనసు పొందితే మంచిదని, లేకుంటే పాతాళంలోకి పడిపోతారని హెచ్చరిస్తున్నారు సామాన్య జనం.
విషయం ఏమిటంటే ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజలను ఉద్దేశించి, తాజా ఎన్నికల విషయం దుయ్యబడుతున్నారని, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే జనాలు ఆయనకు గట్టి కౌంటర్ ఇస్తున్నారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ గత అనుభవాల ద్వారా మనిషి అనే వాడు మారు మనసు పొందుతే బాగుపడతాడు... లేదంటే పుట్టగతులు లేకుండా పోతాడు అనేది చరిత్ర చెబుతోంది... కాదంటారా? ఇదే కదా మనకు చరిత్ర చెబుతోంది. ఎన్నో కుట్రలు పన్ని అధికారం చేజెక్కించుకున్న కౌరవుల పని ఆఖరికి ఏమైంది? ధర్మం చేతిలో ఓడిపోయారు. ఇప్పటికే అదే జరుగుతోంది.... ఎప్పటికీ అదే జరుగుతుంది! ఇది తెలుసుకొని మసులుకున్న నాడు మనిషి అనే వాడు బాగుపడతాడు... లేదంటే తీవ్రమైన పరిణామాలు చవిచూస్తాడు!