2014 వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన విషయం మనకు తెలిసిందే . అలా రాష్ట్రం విడిపోవలసి సమయంలో రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరగడం కోసం కొన్ని విభజన హామీలను చేసుకోవడం జరిగింది . ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది . అయినా కూడా కొన్ని విభజన హామీలు నెరవేరలేదు . ఇక ఆ హామీలు నెర వేరడం కోసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అయినటు వంటి చంద్రబాబు నాయుడు , ప్రస్తుతం తెలంగాణ లో ముఖ్య మంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి తో సమావేశం కావాలి అని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కి ఒక లేఖ రాశారు. ఆ లేక ప్రకారం ... రాష్ట్రాలు విడిపోయిన సమయంలో రెండు రాష్ట్రాలకు అనేక హామీలు ఇచ్చారు. అందులో కొన్ని ఇప్పటివరకు పూర్తి కాలేదు. దానితో విభజన హామీల గురించి కూర్చొని చర్చించి పరిష్కరిద్దాం అని చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి కి ఒక లేఖ రాశారు.
అలాగే విభజన జరిగి ఇప్పటికే 10 ఏళ్లు గడిచిన కొన్ని అంశాలు పరిష్కారం కాలేదు అని అందులో పేర్కొన్నారు. పరస్పర సహకారం ప్రజల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6 వ తేదీన పరస్పరం కలిసి విభజన హామీలపై చర్చిద్దాం అని చంద్రబాబు లేఖలో రాసుకోచ్చారు. అలాగే ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వివరించారు. మరి చంద్రబాబు కోరినట్లు ఈ నెల 6 వ తేదీన ఆయనను రేవంత్ రెడ్డి కలిసి విభజన హామీలపై చర్చిస్తారో ... లేదో అనేది చూడాలి.