జగన్ రాజకీయ జీవితానికి అండగా ఉన్న కుటుంబమే అడ్డయ్యిందిగా?

FARMANULLA SHAIK
* జగన్ కి కుటుంబమే మిత్రువు, కుటుంబమే శత్రువు!
* 2019 ఎన్నికల్లో ఫ్యామిలీ అండతో జగన్ కి ఘన విజయం!
* 2024 ఎన్నికల్లో ఫ్యామిలీ అడ్డుతో జగన్ కి ఘోర పరాజయం!
( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ): వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగిన ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తన మాటకు అడ్డుచెప్పిన వారిని చిత్రహింసలకు గురిచేసి రాక్షసానందం పొందారని అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే ఈ కోవలో కేవలం ప్రతిపక్ష పార్టీల్లోని నేతలే కాదు.. సొంత పార్టీలోని కొంతమంది నేతలు కూడా జగన్ బాధితులుగా మారిపోయారని వార్తలు వచ్చాయి. వీరితో పాటు సొంత తల్లి, చెల్లిని కూడా జగన్ మోహన్ రెడ్డి అమానించారని ఫలితంగా సొంత చెల్లి, తల్లి సైతం జగన్ పార్టీకి దూరంగా వెళ్లిపోయారని ఎన్నో వార్తలు గతంలో విన్నాము. మొత్తానికి ఏది ఏమైనా కారణాలు ఏవైనా జగన్ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి కుటుంబ కలహాలు కూడా ప్రధాన కారణంగా నిలిచాయి.
బాబాయ్ వివేకా హత్య, చెల్లెల్లు సునీత, షర్మిళ జగన్ కి వ్యతిరేకంగా ఉండటం, తమ్ముడు అవినాష్ పై నెగటివిటీ రావడం ఇంకా మంత్రిగా ఫెయిల్ అవ్వడం జగన్ పతనానికి కారణం అయ్యాయి.అయితే  2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి వైఎస్ షర్మిల, విజయమ్మ కూడా ఓ ప్రధాన కారణమనే చెప్పాలి.అదే సమయంలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కూడా వారిద్దరూ కూడా ఓ కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా కూడా సందేహం అవసరం లేదు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల.. జగన్ మోహన్ రెడ్డి పతనమే తన టార్గెట్ గా చేసుకొని తన రాజకీయం చేశారు. పైగా షర్మిలకు మద్దతుగా విజయమ్మ నిలిచారు. 2019 లో జగన్ కి అండగా నిలబడి ఆయనకి గెలుపుని ఇచ్చిన ఫ్యామిలీ 2024 లో అదే అండగా నిలిచిన ఫ్యామిలి ఆయనకి అడ్డుగా నిలబడి ఆయన ఓటమికి ప్రధాన కారణం అయ్యిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా జగన్ రాజకీయ జీవితానికి సొంత ఫ్యామిలీనే అండగా అడ్డుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: