* ప్రతి విషయంలో భారతిని జగన్ ఫాలో కావడం
* జగన్, షర్మిల మధ్య తగాదాలు పెట్టింది భారతమ్మేనా?
* షర్మిల, విజయమ్మ కోపం వెనుక భారతి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత... వైసిపి పార్టీని పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలు గెలుచుకున్న వైసిపి పార్టీని... కేసులు, నోటీసుల పేరుతో మరింత చావు దెబ్బ కొడుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అయితే ఇలాంటి నేపథ్యంలో... మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం వైయస్ భారత్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
వైయస్ షర్మిల, అలాగే వైయస్ విజయమ్మలను జగన్ కు వైయస్ భారతి దూరం చేసినట్లు కొంతమంది అంటున్నారు. ప్రతి భార్య కూడా... భర్త తన మాట వినాలని అనుకుంటుంది. వైయస్ భారతి కూడా అదే యాంగిల్ లో ఆలోచించినట్లు చెబుతున్నారు. వైయస్ విజయమ్మ అలాగే వైయస్ షర్మిల... జగన్తో కలిసి ఉంటే... తనకు స్వేచ్ఛ ఉండబోదనే నేపథ్యంలో... వాళ్లను కావాలనే వైయస్ భారతి దూరం చేసినట్లు కొంతమంది చెబుతున్నారు.
అలాగే... జగన్మోహన్ రెడ్డి అటు వైయస్ షర్మిల మధ్య ఆస్తుల తగాదా చోటు చేస్తుందని... వారి సన్నిహితులు కూడా అప్పట్లో చెప్పారు. అయితే షర్మిల అడిగినట్లు అసలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ... వైయస్ భారతి మాత్రం ఒప్పుకోలేదట. దాని ద్వారా... షర్మిల అలాగే విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి దూరమైనట్టు చెబుతున్నారు.
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి, వైసిపి పార్టీ విజయానికి గతంలో షర్మిల చాలా కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన 2012 నుంచి... 2019 ఎన్నికల వరకు షర్మిల చాలా కష్టపడ్డారు. 2014లో ఆమాత్రం సీట్లు రావడానికి కారణం షర్మిల. జగన్ జైల్లో పడ్డ కూడా షర్మిల.... వైసీపీని కాపాడింది. అలాగే 2019లో జగన్ ముఖ్యమంత్రి కావడానికి షర్మిల ఎంతో కృషి చేశారు. కానీ తన భార్య.. మాట వినడం వల్ల అతన కుటుంబాన్ని జగన్ దూరం చేసుకొని... ఇప్పుడు ఓటమిపాలయ్యాడని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇకనైనా షర్మిలను.. దగ్గర చేసుకోవాలని చెబుతున్నారు.