అవినాష్ కోసం వందలాది మందికి శత్రువైన జగన్.. నమ్మి నట్టేట మునిగాడుగా!

Reddy P Rajasekhar
రాజకీయాల్లో విజయవంతంగా రాణించాలంటే సరైన సమయంలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాట్లు చేసినా కొన్ని సందర్భాల్లో రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయి. వైఎస్ అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేయడమే ప్రస్తుతం వైఎస్ జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమని చాలామంది భావిస్తారు. అవినాష్ కోసం వందలాది మందికి జగన్ శత్రువు అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
స్వల్ప మెజారిటీతో అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు కానీ అవినాష్ రెడ్డికి ఇచ్చిన మద్దతు వల్ల జగన్ ను అభిమానించే అభిమానులు సైతం ఆయనకు దూరమయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో అవినాష్ రెడ్డికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉందని చాలామంది భావిస్తున్నారు. అవినాష్ తప్పు చేయలేదని జగన్ చెబుతున్నా చాలామంది నమ్మడం లేదు.
 
అవినాష్ విషయంలో నిజానిజాలు ప్రూవ్ అయ్యే వరకు జగన్ అవినాష్ కు దూరంగా ఉండి ఉంటే బాగుండేదని ఏపీ ఓటర్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవినాష్ రెడ్డి వల్ల జగన్ కు చెడ్డ పేరు వచ్చిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో సైతం జగన్ ప్రతి విషయంలో అవినాష్ కు అండగా నిలబడటం సరైన నిర్ణయం కాదు.
 
2024 ఎన్నికల్లో జగన్ చిన్నచిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి సైతం ఏర్పడిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తప్పొప్పులను గుర్తించుకుని ముందుకు సాగితే మాత్రమే వైసీపీ రాష్ట్రంలో పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. కూటమి నేతలు చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ జగన్ ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. జగన్ సరైన పొలిటికల్ వ్యూహాలతో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. జగన్ తప్పు మీద తప్పు చేస్తే పార్టీ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: