జగన్ కుటుంబ కథా చిత్రం: షర్మిల, జగన్ కలిసి పని చేసినా ప్రజలు నమ్మే అవకాశాలు ఉన్నాయా.

Pandrala Sravanthi
-చెల్లెలు చెప్పింది వినవయ్య జగన్..
- కుటుంబీకులే నమ్మకుంటే ప్రజలు నమ్ముతారా..
-టిడిపిని కొట్టాలంటే అన్నా చెల్లెళ్లు కలవాల్సిందే.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఇందులో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి సొంతంగా రాజకీయాల్లో ఎదిగారు. ఆ సమయంలో అన్న కోసం చెల్లెలు షర్మిల కూడా ఎంతో కష్టపడింది. ఓవైపు షర్మిల, మరోవైపు తల్లి విజయమ్మ ఇలా కుటుంబ సభ్యులు అంతా కలిసి జగన్ ను ఓ రేవుకు తీసుకొచ్చారు. కానీ చివరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత చెల్లెలిను మెల్లిమెల్లిగా సైడ్ చేసేసాడు. చివరికి ఆస్తుల విషయంలో కూడా మెలిక పెట్టి చెల్లెల్ని మోసం చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అప్పటినుంచి తన చెల్లి షర్మిల, జగన్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేసింది.. జగన్ చాలా డేంజర్ వ్యక్తి అంటూ కామెంట్లు కూడా చేస్తూ వచ్చింది.. ఈ విధంగా అన్నపై విల్లు ఎక్కుపెట్టి చివరికి 2024 ఎలక్షన్స్ లో అధికారం నుంచి దించేసింది. ప్రస్తుతం అన్నకు పదవి లేదు చెల్లెకు పదవి లేదు. మరి ఆంధ్ర రాజకీయాల్లో సెట్ కావాలి అంటే కలిసి పని చేయాలా ఒకవేళ కలిసి పని చేస్తే ప్రజలు నమ్ముతారా?అనే వివరాలు చూద్దాం..
 జగన్ షర్మిల కలిస్తే.?
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా  కొత్తగా ఎన్నికై రాజకీయం మొదలుపెట్టింది వైయస్ షర్మిల. అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూడా కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసి తన సత్తా ఏంటో చూపించగలిగింది. అంతేకాదు తన అన్న జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి చివరికి ఓడించింది. ఈ విధంగా అన్నపై మొదటిసారి పై చేయి సాధించిన షర్మిల, ఇక రెండో ప్లాన్ కూడా మొదలెట్టబోతోంది. అది ఏంటయ్యా అంటే వైయస్ రాజశేఖర్ కటౌట్ ముందు పెట్టుకొని  ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం. దీనికోసం పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తోంది. జూలై 8న వైయస్ జయంతి సందర్భంగా  పెద్ద ఎత్తున వైయస్సార్ జయంతిని నిర్వహించబోతోంది. ఇక్కడి నుంచే తన రాజకీయాన్ని మొదలుపెట్టి తన తండ్రి బాటలోనే నడవాలి అనుకుంటుంది షర్మిల. ఈ విధంగా షర్మిల  కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు 100% చీలిపోతాయి. ఇక ఏపీలో టీడీపీకి తిరుగు ఉండదు..

 అలాంటి ఈ తరుణంలో కొంతమంది వైసీపీ నాయకులు చెల్లి షర్మిలను కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తే  భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ తన అహంకార భావాన్ని చూపిస్తున్నారు. అలా 2024 ఎలక్షన్స్ కు ముందు చూపించారు కాబట్టే పూర్తిస్థాయిలో చతికిల పడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో కలిసి  పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో  విజయం సాధించారు. ఇదే ఫార్ములాను జగన్ మోహన్ రెడ్డి కూడా పాటిస్తే  ఇటు వైఎస్ అభిమానులు, మరోవైపు జగన్ మోహన్ రెడ్డి అభిమానులంతా ఒక్కటై మళ్లీ రాబోయే ఎలక్షన్స్ వరకు బలమైన శక్తిగా ఎదగవచ్చు. అంతేకాదు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మరియు షర్మిలకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో ఇష్టపడతారు. దీన్నే ఆసరాగా చేసుకొని షర్మిల మరియు జగన్మోహన్ రెడ్డి కలిసి  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మొదలు పెడితే మాత్రం  రాబోవు ఎన్నికల్లో తప్పక సక్సెస్ సాధిస్తారని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: