ఏపీ: జగన్ లో ఉన్న ప్రత్యేక లక్షణం ఇదే..?
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునే వారి గురించి చేసిన వాక్యాలు ఆయనలో ఉన్న గొప్ప నాయకుడు లక్షణం నిదర్శనానికి కనిపిస్తోంది. పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకునే వారు వెళ్ళిపోవచ్చు.. అని తాను ఎవరిని బ్రతిమలాడానని తెలియజేశారు. వెళ్లిపోయే వారి గురించి చెబితే నేనేం చేస్తానంటూ కూడా తెలియజేశారు.. నేను ఆపితే మాత్రం ఉంటారా ఇక్కడొక కాలు అక్కడ ఒక కాలు ఎందుకు వెళ్లే వాళ్ళు ఎంతటి వారైనా సరే తను ఆపనని కూడా తెలియజేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన గొప్ప లక్షణం చెబుతున్నాయి.
సహజంగా ఎక్కడైనా పార్టీ అధికారంలో లేకపోతే పార్టీ నుండి నేతలు వెళుతుంటే అధినేతల సైతం ఆపే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు.లేకపోతే వారిని బుజ్జగించే ప్రయత్నం అయినా చేస్తూ ఉంటారు.. కానీ అందుకు విభిన్నంగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండడం గమనార్హం. కేవలం ప్రజలే తమకు మద్దతుగా ఉంటారని చెప్పడం నాయకుడిగా ఒక గొప్ప లక్షణం అని చెప్పవచ్చు. పార్టీని ప్రారంభించినప్పుడు కేవలం తాను తన తల్లి మాత్రమే పార్టీని ప్రారంభించామని విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వీలు వెళ్లిపోతే కూడా తన పార్టీ ఆగిపోదని కూడా తెలియజేశారు. అధికారంలో లేకపోయినా కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయిన జగన్లో ఉన్న కాన్ఫిడెంట్ ఆయన గొప్ప లక్షణం అని చెప్పవచ్చు. ఓటమి బాధతో కృంగిపోనని.. పోరాటాలు తనకి కొత్తేమి కాదని మళ్లీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.