వైఎస్ జయంతి : ఒక్క రూపాయి తీయన‌ని జగన్ చెప్పేశాడా..?

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత భట్టి విక్రమార్కతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని సైతం షర్మిల ఆహ్వానించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా తనకు తాను ప్రోజెక్ట్ చేసుకునేందుకు షర్మిల అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మరి వైయస్ఆర్ పేరు చెప్పుకుని ఇప్పటివరకు రాజకీయం చేస్తూ వచ్చిన ఆయన తనయుడు.. ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం తండ్రి 75వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటన చేశారు. జగన్ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని ఈ ప్రకటన చేశారు. అయితే ష‌ర్మిలను మించి అట్టహాసంగా జగన్ ఈ ప్రోగ్రాం చేస్తారని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశాయి. అయితే పేర్ని నాని వారి ఆశలపై నీళ్లు చల్లారు.

వైయస్ఆర్ అభిమానులు అందరూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఈ సందర్భంగా మొక్కలు నాటడం, రక్తదానాలు చేయడం, పుస్తకాలు పంపిణీ చేయడం చేయాలని సింపుల్ గా పిలుపు ఇచ్చారు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం ష‌ర్మిలను మించి జగన్ పెద్ద కార్యక్రమం చేస్తారని ఎదురు చూస్తే వారికి నిరాశే ఎదురయింది.

ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్.. ఎన్నికల్లో ఓడిపోయిన నెలరోజులకు తండ్రి జయంతి కార్యక్రమం వస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వైసీపీ క్యాడ‌ర్‌ మీదకే మొత్తం తోసేసారని వైసీపీ వాళ్ళే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని ప్రకటనలను బట్టి చూస్తే జగన్ సింపుల్‌గా తన ఆఫీసులో వైఎస్ ఫోటోకు దండ వేసి దండం పెట్టి చూడటం మినహా చేసేదేం ఉండదని క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: