కొడుకా, కూతురా విజయమ్మ సపోర్ట్ ఎవరివైపు?

murali krishna
*ఆసక్తి రేకెత్తిస్తున్న జగన్ సొంత ఇంటి పాలిటిక్స్
*షర్మిలతో విబేధమే జగన్ కొంప ముంచిందా?
*వీరిద్దరి మధ్య నలిగిపోతున్న విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ పెను మార్పు తీసుకొచ్చారు.చిన్న వయసులోనే సీఎం అయి వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజకీయాలలోకి వచ్చిన జగన్ అనతి కాలంలోనే మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణంతో జగన్ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ని విభేధించి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఎంతో బలోపేతం చేసారు. అయితే రాష్ట్రం రెండుగా విభజించబడటంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కనుమరుగయింది. 2014 ఎన్నికలలో చంద్రబాబు పవన్ మద్దతుతో ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ ఎన్నికలలో వైసీపీ 68 సీట్లు పైగా సాధించింది. ఆ తరువాత తండ్రి వలె జగన్ పాదయాత్ర నిర్వహించారు.2019 ఎన్నికలలో భాగంగా తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పూర్తి మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికలలో వైసీపీ ఏకంగా 151సీట్లు సాధించి సంచలన విజయం నమోదు చేసింది..

2019 ఎన్నికల్లో ఐక్యంగా ఉన్న వైఎస్ కుటుంబం తర్వాత కొన్ని పరిణామాలతో చీలిపోయిది. అన్న జగన్ తో విభేదించిన షర్మిల ముందు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న షర్మిలకు వైఎస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా లభిస్తోంది. తన తండ్రి హత్యకు కారణమైన దోషులను శిక్షించడంలో విఫలమయ్యారన్న కారణంతో జగన్ ను వివేకా కూతురు సునీత వ్యతిరేకించింది.. వైఎస్ ఫ్యామిలీకి చెందిన ఇద్దరు సోదరీమణులు జగన్ కి వ్యతిరేకంగా పోటీ చేసారు...
ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె ఇద్దరూ చెరో దారిలో వెళ్తున్న టైంలో తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు షర్మిలకు తల్లిగా విజయ సపోర్ట్ చేశారు. ఏపీ రాజకీయాల్లోకి ఆమె వచ్చిన తర్వాత కొన్ని రోజులు విజయమ్మ సైలెంట్ అయిపోయారు.
గత ఎన్నికల్లో కుమారుడు జగన్ విజయం కోసం ఎంతో శ్రమించిన విజయమ్మ ఎన్నికలకు ముందు అమెరికాకు వెళ్లి షర్మిలకు మద్దతు తెలుపుతూ వీడియో రిలీజ్ చేసారు.దీనితో ఈసారి జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అలాగే షర్మిల కూడా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. దీనితో ఈ సారి విజయమ్మ తన కొడుకు తరుపున నిలబడుతుందా లేదా కూతురు తరుపున నిలబడుతుందా అనేది ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: