మోడీ - బాబు మ‌ధ్య‌లో మ‌రో ప‌ద‌వి చ‌ర్చ‌.... బాబు షాకింగ్ రియాక్ష‌న్‌..?

RAMAKRISHNA S.S.
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
గత ఇదేళ్ళు శత్రువులుగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ ఇప్పుడు మంచి మిత్రులు అయిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. పైగా తెలుగుదేశంకు కేంద్ర మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు కూడా దక్కాయి. రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఇద్ద‌రూ టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎలాంటి పదవులను ఆశించడం లేదని.. ఢిల్లీలో స్పష్టం చేశారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కగా మంత్రివర్గ విస్తరణలో మరో సహాయ మంత్రి పదవి కూడా దక్కుతుంద‌న్న ప్రచారం ఉంది. అయితే దీనిపై చంద్రబాబు స్పందించారు. తమకు ఎలాంటి మంత్రి పదవులు అవసరం లేదని చెప్పారు. మీడియా ప్రతినిధులు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తీసుకుంటారా ? అని ప్రశ్నించగా.. మోడీకి మామధ్య ఎలాంటి పదవులు చర్చ రాలేదని.. తాము పదవుల కోసం ప్రాకులాడటం లేదని.. రాష్ట్ర ప్రయోజనాలే తమ కు ముఖ్యం అని చంద్రబాబు చెప్పారు.  

ఎన్డీఏ కూట‌మి లో ఉన్నందు న వారు ఆఫర్ చేసిన రెండు మంత్రి పదవులను మాత్రమే తీసుకున్నామని.. గతంలో వాజ్‌పేయ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏడు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినా అవేమీ వద్దని.. ఒక స్పీకర్ పదవి తీసుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. ఏది ఏమైనా నరేంద్ర మోడీ, బాబు మధ్యలో మరో సహాయ మంత్రి పదవి పై చర్చ జరిగి ఉంటుందన్న టాక్‌ కూడా ఢిల్లీలో వినిపించింది. అయితే చంద్రబాబు కేంద్రంలో మూడో మంత్రి పదవి తీసుకుంటారా..? లేదా రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానంగా నిధులు రాబట్టుకుంటారా..? అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: