జ‌గ‌న్ వైసీపీలో మిగిలిన‌ క‌మ్మ‌ల‌ను ఉంచుతాడా.. పీకేస్తాడా ?

RAMAKRISHNA S.S.
వైసీపీ అధినేత జగన్ 2014లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి.. కమ్మ సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా టార్గెట్గా చేసుకుని రాజకీయం చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మిగిలిన కులాల్లో కమ్మ సామాజిక వర్గంపై తీవ్రమైన విద్వేషం వచ్చేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. జగన్ ఘనవిజయం సాధించడానికి ఇది కూడా ఒక కీలక అంశంగా నిలిచింది. 2019లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గ వ్యాపార, రాజకీయ అంశాలను బాగా టార్గెట్ చేశారు. ఇంకా చెప్పాలంటే వారు ఏ రంగంలో ఉన్నా కూడా వారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నాలే ఎక్కువగా జరిగాయి.

చివరకు తన సొంత పార్టీలో కూడా ఎక్కువ మంది కమ్మ నేతలకు పదవులు ఇవ్వలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇస్తానని హామీ ఇచ్చి కూడా.. జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా ఏడాది ముందు మాత్రమే ఇచ్చారు. ఎన్నికల్లో కేవలం 9 అసెంబ్లీ సీట్లు మాత్రమే కమ్మలకు ఇచ్చిన జగన్.. ఒక విజయవాడ పార్లమెంటు స్థానాల మాత్రమే కమ్మ వర్గానికి చెందిన కేశినేని నానికి ఇచ్చారు. అది కూడా నాని పార్టీ మారి వైసీపీలోకి రావడంతో మాత్రమే ఆయనకు ఎంపీ సీటు దక్కింది.

లేకపోతే కమ్మలకు ఒక్క ఎంపీ సీటు కూడా వైసీపీ నుంచి దక్కేదేకాదు. ముందు నుంచి కూడా యాంటీ కమ్మ రాజకీయాలు చేస్తూ వచ్చిన జగన్ సొంత పార్టీలో కూడా కమ్మలను ఏమాత్రం ఎంకరేజ్ చేయలేదు. జగన్‌ను నమ్మి ఉన్నవారికి కూడా న్యాయం జరగలేదు. ఈ ఎన్నికల్లో కమ్మ‌ సామాజిక వర్గం అంతా జగన్‌కు పూర్తి వ్యతిరేకంగా ఓట్లు వేసింది. మరి సొంత పార్టీలో మిగిలిన కొద్ది మంది కమ్మ నేతలను అయినా జగన్ ఉంచుతారా.. వారిని కూడా పూర్తిగా పక్కన పడేస్తారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా జగన్ వెంట వల్లభనేని వంశీ, కొడాలి నాని దేవినేని అవినాష్ లాంటి కమ్మ నేతలు తప్ప ఎవరు ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: