జగన్ కు ఎదురుదెబ్బ..చిత్తూరు కార్పొరేషన్ కూటమి వశం ?
ఇక ఇప్పుడు.. ఏపీలో ఉన్న కార్పొరేషన్ అలాగే మున్సిపాలిటీలను టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా చిత్తూరులో.. వైసీపీని దెబ్బ కొట్టింది టిడిపి. చిత్తూరు కార్పొరేషన్ ను టిడిపి కైవసం చేసుకుంది. చిత్తూరులో వైసిపి పార్టీకి చెందిన మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ సహా 18 మంది కార్పొరేటర్లు... టిడిపి కండువా వేసుకున్నారు.
శుక్రవారం రాత్రి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో... వీరందరూ టిడిపిలో చేరిపోయారు. కొన్నాళ్ల కిందట నలుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్... కూటమి చేతిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం చిత్తూరు నగరపాలక సంస్థలో 50 డివిజన్లో ఉన్న సంగతి తెలిసిందే.
గతంలో 37 చోట్ల వైసిపి ఏకగ్రీవం అయింది. కానీ ఇప్పుడు... దాదాపు 18 మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. పాత కార్పొరేటర్లు ముగ్గురు... వైసిపి 18 మందితో మొత్తం... టిడిపి బలం 21కి చేరుకుంది.. అటు జనసేన నలుగురు కలిపితే... తెలుగుదేశం కూటమికి 25 మంది సభ్యులు ఉన్నారు. చిత్తూరు అలాగే పూతలపట్టు ఎమ్మెల్యేలు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. వారు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటే.. టిడిపి కూటమి ఆదిక్యత సంపాదిస్తుంది. దీంతో వైసీపీలో ఉన్న మరి కొంత మంది కూడా బయ టికి వచ్చే ఛాన్స్ ఉందట.