చంద్రబాబుతో రేవంత్ భేటీ.. ఏ చిన్న తప్పు చేసినా తెలంగాణ ద్రోహి అయిపోతారు..??

Suma Kallamadi
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. బాబుకి రేవంత్ శిష్యుడు అవుతారని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దీన్ని రేవంత్ బయటికి మాత్రం ఒప్పుకోరు కానీ వారి మధ్య ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ బాగానే కష్టపడ్డారు చివరికి ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు దాని తర్వాత విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలు జరుపుదాం అనగానే అందుకు రేవంత్ ఒప్పుకున్నారు. ఈరోజు అంటే శనివారం హైదరాబాద్ సిటీలోనే వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది. దీనిపైన అందరి దృష్టి పడింది.
అయితే ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దొంగలోకి తొక్కితే రేవంత్ పై తెలంగాణ ద్రోహి అనే ముద్రను ప్రతిపక్ష పార్టీలు వేసే అవకాశం ఎక్కువగా ఉంది. సమస్యల పరిష్కారం అంటున్నారు. ఇదే భేటీలో చంద్రబాబు ఏపీ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రేవంత్ తెలంగాణకు ఏదైనా అన్యాయం చేసి ఉంటే ఆయనపై తెలంగాణ ద్రోహి అనే ముద్ర కచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వారు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేరే రాష్ట్రం ముఖ్యమంత్రి తమకు తెలిసిన వారే అని వారికి ఫేవర్ గా నడుచుకుంటే అంతే సంగతులు. అందుకే ఈ భేటీ రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము లాంటిది అని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు .
 సీపీఐ జాతీయ నాయకుడికి నారాయణ రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశారు. నీటి సమస్య, భద్రాచలం, విభజన సమస్యలు ఉన్నాయని వీటి విషయాల్లో ఏమాత్రం అలసత్వంగా ప్రవర్తించకూడదని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం నీట మునుగుతుందని ఇప్పటికే చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇరు రాష్ట్రాలు కొన్ని సాగునీటి ప్రాజెక్టులను ఎవరి పర్మిషన్ తీసుకోకుండా నిర్మించాయి వీటి విషయంలో కేంద్రం దాకా ఫిర్యాదులు వెళ్లాయి. ఇంకా ఇలాంటి సమస్యలను ఉన్నాయి వీటిలో ఏమాత్రం తలొగ్గినా రేవంత్ కు తీవ్రమైన ఇబ్బందులు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: